Homeతెలంగాణసీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన..23 నెలల్లో 56వ ఢిల్లీ పర్యటన

సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన..23 నెలల్లో 56వ ఢిల్లీ పర్యటన

క్రైమ్ మిర్రర్ తెలంగాణ బ్యూరో: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. డిసెంబర్ 8, 9 తేదీల్లో హైదరాబాద్‌లో జరగబోయే ఇండో-యూఎస్ సమ్మిట్ (Indo-US Summit) నేపథ్యంలో ప్రపంచ పెట్టుబడిదారులను తెలంగాణకు ఆహ్వానించడం, రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అద్భుత అవకాశాలను వారికి వివరించడం కోసం ఈ పర్యటనకు ప్రధాన కారణం యూఎస్-ఇండియా స్ట్రాటజిక్ పార్ట్‌నర్‌షిప్ ఫోరం (USISPF) సమావేశంలో పాల్గొన్నారు.

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఫలితాల నేపథ్యంలో, గురువారం రాత్రే ఆయన తిరిగి హైదరాబాద్ చేరుకోవచ్చని సమాచారం. గురువారం ఉదయం జరిగిన USISPF సమావేశంలో పాల్గొని, తెలంగాణను పెట్టుబడులకు అనుకూలమైన రాష్ట్రంగా ప్రచారం చేశారు. ఈ సందర్భంగా పలు అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు.

ఈ పర్యటనలో ఆయన కొందరు కేంద్ర మంత్రులను కలిసి మెట్రో రైలు విస్తరణ, మూసీ ప్రక్షాళన, రీజనల్ రింగ్ రోడ్డు వంటి రాష్ట్ర ప్రాజెక్టులకు సంబంధించిన అనుమతులు, నిధులపై చర్చించే అవకాశం ఉంది. అలాగే, కాంగ్రెస్ హైకమాండ్‌ను కలిసి డీసీసీ అధ్యక్షుల నియామకం వంటి పార్టీ సంస్థాగత విషయాలపై చర్చించే అవకాశం కూడా ఉంది. గత 23 నెలల్లో రేవంత్ రెడ్డికి ఇది 56వ ఢిల్లీ పర్యటన కావడం గమనార్హం.

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

తాజావార్తలు