Homeజాతీయంహైదరాబాద్ నుంచి ప్రత్యేక రైళ్లు, ఎప్పటి నుంచి అంటే?

హైదరాబాద్ నుంచి ప్రత్యేక రైళ్లు, ఎప్పటి నుంచి అంటే?

Special Trains: ప్రయాణీకుల రద్దీకి అనుగుణంగా ప్రత్యేక రైళ్లను అందుబాటులో ఉంచుతుంది ఇండియన్ రైల్వే. ఇబ్బందిలేని ప్రయాణ అనుభాన్ని అందించేందుకు ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే హైదరాబాద్ నుంచి కన్యాకుమారికి ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే ప్రకటించింది. ఈ ప్రాంతాల మధ్య రాకపోకలు కొనసాగించే ప్రయాణీకులు వీటిని ఉపయోగించుకోవాలని సూచించింది.

ప్రత్యేక రైళ్ల వివరాలు 

హైదరాబాద్ నుంచి కన్యాకుమారికి జూలై 2 నుంచి ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. రెండు నగరాల మధ్య నాలుగు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు తెలిపింది. 07230 నెంబర్ గల హైదరాబాద్‌- కన్యాకుమారి ప్రత్యేక రైలు జూలై 2, 9, 16, 23 తేదీల్లో హైదరాబాద్‌ నుంచి బయల్దేరుతుంది. సాయంత్రం 5.20 గంటలకు ప్రయాణాన్ని మొదలుపెట్టి, మూడోరోజు తెల్లవారుజామున 2.30 గంటలకు కన్యాకుమారికి చేరుకుంటుంది. ఇక 07229 నెంబర్ గల కన్యాకుమారి- హైదరాబాద్ ప్రత్యేక రైలు జూలై 4, 11, 18, 25 తేదీల్లో కన్యాకుమారి నుంచి బయల్దేరుతుంది. తెల్లవారుజామున 5.15 గంటలకు ఈ రైలు అక్కడి నుంచి ప్రయాణాన్ని మొదలుపెట్టి మరుసటి రోజు మధ్యాహ్నం 2.30 గంటలకు హైదరాబాద్‌ కు చేరుకుంటుంది.

ఈ రైళ్లు ఏ స్టేషన్లలో ఆగుతాయంటే?

హైదరాబాద్- కన్యాకుమారి మధ్య నడిచే ప్రత్యేక రైళ్లు నెల్లూరు, గూడూరు, రేణిగుంట, తిరుపతి, పాకాల, చిత్తూరు, కాట్పాడి సహ ముఖ్యమైన రైల్వే స్టేషన్లలో ఆగుతాయి. రెండు వైపులా రైళ్లు హాల్టింగ్ తీసుకోనున్నట్లు అధికారులు తెలిపారు.

Read Also: శ్రీశైలం ప్రాజెక్టులోకి పోటెత్తిన వరద, త్వరలో గేట్లు ఓపెన్!

Anjibabu Chittimalla
Anjibabu Chittimallahttps://crimemirror.com/
గత 16 సంవత్సరాలుగా మీడియా రంగంలో పని చేస్తున్నాను. ABN ఆంధ్రజ్యోతి, టీ-న్యూస్‌, వెలుగు దినపత్రిక, V6 చానెల్ లో జర్నలిస్టుగా పని చేశాను. 2022 నుంచి 2024 వరకు ‘ABP దేశం’కు ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా పని చేశాను. BIG TVకి ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా ట్రావెల్, వైరల్, లైఫ్ స్టైల్, టెక్ అండ్ సైన్స్, ఆటో, క్రైమ్ వార్తలు అందించాను. ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నాను.

తాజావార్తలు