Wednesday, March 11, 2026
Homeఅంతర్జాతీయంఇరాన్ అణు స్థావరాలపై దాడులు, అమెరికాలో హై అలర్ట్!

ఇరాన్ అణు స్థావరాలపై దాడులు, అమెరికాలో హై అలర్ట్!

High Alert In America: ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధంలోకి అమెరికా ఎంట్రీ ఇచ్చింది. ఇరాన్ లోని మూడు కీలక అణు స్థావరాలపై అమెరికా బాంబుల వర్షం కురిపించింది. భూగర్భంలో ఉన్న అణు క్షేత్రాలను ధ్వంసం చేసేందుకు వేలాది కిలోల బరువున్న బాంబులను వేసింది. ఈ నేపథ్యంలో ఇరాన్ ప్రతిదాడులకు దిగే అవకాశం ఉండటంతో అమెరికా అలర్ట్ అయ్యింది. తమ దేశంలోని కీలక ప్రాంతాలతో పాటు పౌరులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ముందు జాగ్రత్త చర్యలు చేపడుతోంది. అందులో భాగంగానే దేశ వ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించింది. ముఖ్యంగా ప్రార్థనా స్థలాలు, సున్నితమైన ప్రాంతాల్లో నిఘాను కట్టుదిట్టం చేసింది. వాషింగ్టన్, న్యూయార్క్ సహా పలు నగరాల్లో హై అలర్ట్ ప్రకటించింది. ఇరాన్ లో అమెరికా దాడులు చేసిన నేపథ్యంలో పరిస్థితిని అంచనా వేస్తున్నట్లు న్యూయార్క్ పోలీసులు వెల్లడించారు. అన్ని ప్రాంతాల్లో భద్రత కట్టుదిట్టం చేసినట్లు తెలిపారు.  సాంస్కృతిక, దౌత్య ప్రాంతాల్లోనూ భద్రత పెంచినట్లు వెల్లడించారు.

ప్రజలకు ముప్పు కలగకుండా చర్యలు

ఇరాన్ ఒకవేళ దాడులకు పాల్పడితే పౌరులకు హానికలగకుండా ఎలాంటి చర్యలు చేపట్టాలి? అనే అంశంపై అమెరికా ఆరా తీసుకోంది. ఈ మేరకు లాస్ ఏంజెల్స్ మేయర్ కరన్ బాస్ కీలక ప్రకటన చేశారు. ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రజా భద్రతకు ఎలాంటి హాని కలగకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఇరాన్ నుంచి తమ ప్రాంతంలో దాడులు చేస్తున్నట్లు ఎలాంటి బెదిరింపులు రాలేదన్నారు. ఎందుకైనా మంచిదనే ఉద్దేశంతో ప్రార్థనా స్థలాలు, జన సమూహాలు ఉన్న ప్రాంతాల్లో పటిష్ట జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అటు మెట్రో పాలిటన్ పోలీసు అధికారులు కూడా కొలంబియాలో ఎలాంటి ఘటనలు జగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

Read Also: ట్రంప్ మొద లుపెట్టాడు, మేం క్లోజ్ చేస్తాం.. ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్!

Anjibabu Chittimalla
Anjibabu Chittimallahttps://crimemirror.com/
గత 16 సంవత్సరాలుగా మీడియా రంగంలో పని చేస్తున్నాను. ABN ఆంధ్రజ్యోతి, టీ-న్యూస్‌, వెలుగు దినపత్రిక, V6 చానెల్ లో జర్నలిస్టుగా పని చేశాను.2022 నుంచి 2024 వరకు ‘ABP దేశం’కు ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా పని చేశాను. BIG TVకి ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా ట్రావెల్, వైరల్, లైఫ్ స్టైల్, టెక్ అండ్ సైన్స్, ఆటో, క్రైమ్ వార్తలు అందించాను.ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నాను.
RELATED ARTICLES

Most Popular

Recent Comments