Wednesday, March 18, 2026
Homeతెలంగాణమరో 4 రోజులు వర్షాలు.. వాతావరణశాఖ ఇంకా ఏం చెప్పిందంటే?

మరో 4 రోజులు వర్షాలు.. వాతావరణశాఖ ఇంకా ఏం చెప్పిందంటే?

 Telangana Weather Report: రాష్ట్రంలో విచిత్ర వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ఓవైపు వర్షాలు కురుస్తుండగా, మరోవైపు ఎండలు మండుతున్నాయి. తెలంగాణలో పలు జిల్లాల్లో ఎండలు తీవ్ర స్థాయికి చేరగా, మరికొన్ని జిల్లాల్లో ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కుస్తున్నారు. రాష్ట్రంలో మరో నాలుగు రోజుల పాటు వానలు కుస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.

ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం

ఓవైపు రుతుపవనాలకు తోడు, మరోవైపు ఉపరితల ఆవర్తనం ఏర్పడినట్లు వాతావరణ అధికారులు తెలిపారు. ప్రస్తుతం గుజరాత్‌ దాని సమీప ప్రాంతంలో సగటు సముద్ర మట్టం నుంచి 7.6 కి.మీ ఎత్తులో కొనసాగుతున్నట్లు తెలిపింది. ఈ మేరకు ఓ ప్రకటనను విడుదల చేసింది. ఈ ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలో నాలుగు రోజుల పాటు తేలిక నుంచి ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. సోమవారం నాడు ఉరుములు, మెరుపులుతో కూడిన వర్షాలు పడినట్లు చెప్పింది. అంతేకాదు, గంటలకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో కూడిన గాలులు వీచినట్లు తెలిపింది. పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వానలు పడినట్లు వెల్లడించింది.

ఇప్పటికీ పడని సరిపడ వర్షాలు

వాస్తవానికి జూన్ తొలి వారం నుంచే భారీ వర్షాలు కురుస్తాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతాయి. కానీ, ఈ ఏడాది రుతుపవనాల ప్రభావం అంతగా కనిపించడం లేదు. గత ఏడాదితో పోల్చితే ఈసారి ముందుగానే రాష్ట్రంలోకి రుతుపవనాలు అడుగు పెట్టినా, అనుకున్న స్థాయిలో వర్షాలు మాత్రం కురవలేదు. అన్నదాతలు ఎప్పుడెప్పుడు గట్టి వానలు పడుతాయా? అని ఎదురుచూస్తున్నారు. మరోవైపు ఇప్పటికే రైతులు పత్తి సహా ఇతర మెట్ట పంటలకు విత్తనాలు వేశారు. వానాకాలం సీజన్ కు సంబంధించి రైతులు వరినార్లు పోసుకుంటున్నారు.

Read Also: రైతు భరోసా నిధులు విడుదల.. 9 రోజుల పాటు రైతుల ఖాతాల్లో జమ!

Anjibabu Chittimalla
Anjibabu Chittimallahttps://crimemirror.com/
గత 16 సంవత్సరాలుగా మీడియా రంగంలో పని చేస్తున్నాను. ABN ఆంధ్రజ్యోతి, టీ-న్యూస్‌, వెలుగు దినపత్రిక, V6 చానెల్ లో జర్నలిస్టుగా పని చేశాను.2022 నుంచి 2024 వరకు ‘ABP దేశం’కు ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా పని చేశాను. BIG TVకి ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా ట్రావెల్, వైరల్, లైఫ్ స్టైల్, టెక్ అండ్ సైన్స్, ఆటో, క్రైమ్ వార్తలు అందించాను.ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నాను.
RELATED ARTICLES

Most Popular

Recent Comments