Homeఅంతర్జాతీయంప్రధాని మోదీ పర్యటన చరిత్రాత్మకం.. సైప్రస్ ప్రెసిడెంట్ నికోస్!

ప్రధాని మోదీ పర్యటన చరిత్రాత్మకం.. సైప్రస్ ప్రెసిడెంట్ నికోస్!

PM Modi Cyprus Visit: ‘ఆపరేషన్ సిందూర్’ నేపథ్యంలో పాకిస్తాన్ కు తుర్కియే మద్దతు పలికిన నేపథ్యంలో భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. తుర్కియేకు బద్ద శత్రువు అయిన సైప్రస్ తో దోస్తీ కట్టింది. అంతేకాదు, జీ7 సమావేశాల కోసం విదేశాలకు బయల్దేరిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.. నేరుగా సైప్రస్ కు వెళ్లారు. ప్రధాని మోడీది చరిత్రాత్మక పర్యటనగా సైప్రస్ అధ్యక్షుడు నికోస్ అభిప్రాయపడ్డారు. ఈ పర్యటనతో రెండు దేశాల మధ్య కొత్త అధ్యాయం ప్రారంభం అవుతుందన్నారు.

2 దశాబ్దాల తర్వాత ఇదే తొలిసారి!

విదేశీ పర్యాటనలో భాగంగా ప్రధాని మోడీ సైప్రస్‌లో పర్యటిస్తున్నారు. ఆదివారం సైప్రస్ చేరుకున్న మోడీకి ఆ దేశ అధ్యక్షుడు నికోస్ క్రిస్టోడోలైడ్స్ నేరుగా ఎయిర్ పోర్టుకు వెళ్లి స్వయంగా స్వాగతం పలికారు. 2 దశాబ్దాల తర్వాత భారత ప్రధాని సైప్రస్ సందర్శనకు వెళ్లడం ఇదే తొలిసారి. రెండు దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులు, ఇతర రంగాల్లో సంబంధాలు బలోపేతం అవుతాయని ప్రధాని మోడీ అభిప్రాయపడ్డారు. దీనికి మద్దతుగా.. ప్రధాని మోడీది చరిత్రాత్మక పర్యటన అంటూ సైప్రస్ అధ్యక్షుడు నికోస్ తెలిపారు. ఈ పర్యటనతో రెండు దేశాల మధ్య కొత్త అధ్యయం ప్రారంభమవుతుందన్నారు. ఈ పర్యటనతో ప్రధాని మోడీ తుర్కియేతో పాటు పాకిస్తాన్ కు గట్టి మెసేజ్ ఇచ్చినట్లు అయ్యిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సైప్రస్ నుంచి ప్రధాని మోడీ కెనడాలోని కననాస్కిస్‌ కు వెళ్లనున్నారు. అక్కడ జరిగే జీ7 శిఖరాగ్ర సదస్సులో పాల్గొంటారు. అనంతరం క్రొయేషియా పర్యటనకు ప్రధాని మోడీ వెళ్తారు.

Read Also: ట్రంప్ హత్యకు ఇరాన్ కుట్ర.. నెతన్యాహహూ సంచలన వ్యాఖ్యలు!

Anjibabu Chittimalla
Anjibabu Chittimallahttps://crimemirror.com/
గత 16 సంవత్సరాలుగా మీడియా రంగంలో పని చేస్తున్నాను. ABN ఆంధ్రజ్యోతి, టీ-న్యూస్‌, వెలుగు దినపత్రిక, V6 చానెల్ లో జర్నలిస్టుగా పని చేశాను. 2022 నుంచి 2024 వరకు ‘ABP దేశం’కు ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా పని చేశాను. BIG TVకి ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా ట్రావెల్, వైరల్, లైఫ్ స్టైల్, టెక్ అండ్ సైన్స్, ఆటో, క్రైమ్ వార్తలు అందించాను. ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నాను.

Most Popular

Recent Comments