Homeఆంధ్ర ప్రదేశ్లడ్డూ ప్రసాదంపై అసత్య ఆరోపణలు, టీటీడీ షాకింగ్ డెసిషన్!

లడ్డూ ప్రసాదంపై అసత్య ఆరోపణలు, టీటీడీ షాకింగ్ డెసిషన్!

Tirumala Tirupati Devasthanam: ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం తిరుపతి తిరుమల దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీవేంకటేశ్వర స్వామివారి ప్రతిష్టకు, తిరుమల లడ్డూ పవిత్రతకు భంగం కలిగించేలా ఎవరు వ్యవహరించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. అసత్య ప్రచారాలు చేస్తే, సివియర్ యాక్షన్ తీసుకుంటామని తేల్చి చెప్పింది. ఎవరు, నిరాధార ఆరోపణలు చేసిన చట్టపరమైన చర్యలు ఎదుర్కోక తప్పదని వెల్లడించింది.

ఇంతకీ అసలు ఏం జరిగిందంటే?

తాజాగా తెలంగాణకు చెందిన ఓ భక్తులు తిరుమల లడ్డూ గురించి షాకింగ్ కామెంట్స్ చేశాడు. సదరు భక్తుడి వ్యాఖ్యలపై టీటీడీ రియాక్ట్ అయ్యింది. ఆయన ఆరోపణలన్నీ అవాస్తవాలేనని తేల్చి చెప్పింది. రంగారెడ్డి జిల్లాకు చెందిన నవీన్ కుమార్ అనే భక్తుడు జూన్ 8న తిరుమలకు వెళ్లాడు. దర్శనం అనంతరం స్వామివారి  లడ్డూలను కొనుగోలు చేశాడు. ఆలయానికి ఎదురుగా ఉన్న ప్రాంతంలో కూర్చొని లడ్డూ తింటుండగా, నోట్లో గాయమైంది. లడ్డు తింటుండగానే గాయం అయ్యిందని ఆరోపించాడు.

ఆరోపణలను తోసిపుచ్చిన టీటీడీ

ఈ విషయంపై తిరుపతి తిరుమల దేవస్థానం స్పందించింది. శ్రీవారి ప్రసాదం తినడం వల్ల నోట్లో గాయమైందనే ఆరోపణలు అన్నీ అవాస్తవాలేనని తేల్చి చెప్పింది. ప్రసాదం తింటూ నాలుక కరుచుకోవడంతోనే గాయం అయినట్లు వెల్లడించింది. టీటీడీ నుంచి నష్టపరిహారం పొందాలనే దురుద్దేశంతోనే, ఆయన సోషల్ మీడియా వేదికగా అసత్య ఆరోపణలు చేసినట్లు వెల్లడించింది. ఇకపై ఎవరు తప్పుడు ప్రచారాలు చేసిన ఇబ్బందులు తప్పవని హెచ్చరించింది. భక్తులు స్వామివారి ప్రతిష్టకు భంగం వాటిల్లకుండా చూసుకోవాలని సూచించింది.

Read Also: చురుగ్గా రుతు పవనాలు.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్!

Anjibabu Ch
Anjibabu Chhttps://crimemirror.com/
గత 15 సంవత్సరాలుగా మీడియా రంగంలో ఉన్నారు. పలు ప్రముఖ మీడియా సంస్థల్లో పని చేశారు. ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నారు. రాజకీయాల నుంచి సినిమాల వరకు.. నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ వరకు.. స్పోర్ట్స్ నుంచి క్రైమ్ వరకు అన్ని రకాల కథనాలు అందిస్తున్నారు.

తాజావార్తలు