Tuesday, March 10, 2026
Homeఆంధ్ర ప్రదేశ్విజయవాడ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి?

విజయవాడ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి?

– విజయవాడ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం

– ఆగి ఉన్న లారీని ఢీ కొట్టిన ట్రావెల్ బస్సు

– బస్సు డ్రైవర్, ఒక ప్రయాణికురాలు మృతి

చౌటుప్పల్, క్రైమ్ మిర్రర్:
:-
లారీని ఢీకొట్టిన బస్సు సంఘటనలో ఇద్దరు మృతి చెందిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా, చౌటుప్పల్ మండలం ఖైతపురం వద్ద విజయవాడ – హైదరాబాద్ జాతీయ రహదారిపై బుధవారం తెల్లవారుజామున చోటు చేసుకున్నది. చౌటుప్పల్ సిఐ మన్మథ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం… ఈ నెల 3న మంగళవారం ఎన్ఎల్ 01బి2309 నెంబర్ గల శివాంజలి ట్రావెల్స్ బస్సు సుమారు రాత్రి 8:30 గంటల సమయంలో కందుకూరు నుండి బయలుదేరి విజయవాడ నుండి హైదరాబాద్ వైపు వెళ్లే రోడ్డుపై చౌటుప్పల్ మండలం ఖైతపురం వద్ద ఈనెల 4న బుధవారం తెల్లవారుజామున సుమారు 4:30 గంటలకు రోడ్డుమీద ఎటువంటి సిగ్నల్ ఇవ్వకుండా ఎంఎల్ 01ఏజి 9719 నెంబర్ గల లారీ డ్రైవర్ లారీని ఆపి ఉంచడం వలన బస్సు డ్రైవర్ మెడబాలి కొండలరావు(41), తన బస్సు కంట్రోల్ గాక ఆగి ఉన్న లారీని వెనుక నుండి ఢీ కొట్టడంతో బస్సు ముందు భాగం పూర్తిగా ధ్వంసమై బస్సు డ్రైవర్ తో పాటు, దెందబోయిన గోవిందమ్మ (47) అనే మహిళా ప్రయాణికురాలు మరణించినట్లు సిఐ తెలిపారు. మృతురాలు ప్రకాశం జిల్లా కు చెందినట్లు గుర్తించామన్నారు. ఈ ప్రమాదంలో బస్సులో ఉన్నటువంటి 18 మంది ప్రయాణికులు స్వల్ప గాయాలైనట్లు తెలిపారు. మృతురాలి కుమారుడు దెందబోయిన మహేందర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ మన్మథ కుమార్ తెలిపారు.

కమలంలో కల్లోలం – దమ్ముంటే సస్పెండ్ చేయండి- రాజాసింగ్‌ వార్నింగ్‌

త్వరలో ఏపీ కేబినెట్‌ విస్తరణ – డేజంర్‌ జోన్‌లో ఉత్తరాంధ్ర మంత్రి

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది.పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.
RELATED ARTICLES

Most Popular

Recent Comments