Homeతెలంగాణతెలంగాణాలో మరో 32 మంది ఐపీఎస్ అధికారుల బదిలీలు

తెలంగాణాలో మరో 32 మంది ఐపీఎస్ అధికారుల బదిలీలు

క్రైమ్ మిర్రర్ తెలంగాణ బ్యూరో:- తెలంగాణ ప్రభుత్వం పోలీసు శాఖలో భారీగా బదిలీలు చేపట్టింది. 32 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.

బదిలీలు మరియు పోస్టింగ్‌ల వివరాలు:

>>>>సీనియర్ ఐపీఎస్ అధికారి దేవేందర్ సింగ్ చౌహాన్‌కు అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ADGP), పర్సనల్గా పోస్టింగ్ ఇచ్చారు.

>>>>జే. పరిమళ హన నూతన్ జాకబ్ను క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్ (CID) డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (DIG)గా నియమించారు.

>>>>చేతన్ మైలబత్తులను RBVRR తెలంగాణ పోలీస్ అకాడమీ (TGPA) డిప్యూటీ డైరెక్టర్‌గా బదిలీ చేశారు.

>>>>నారాయణ రెడ్డి మహేశ్వరం జోన్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (DCP)గా బాధ్యతలు స్వీకరించనున్నారు.
వైభవ్ గైక్వాడ్‌ను హైదరాబాద్ టాస్క్ ఫోర్స్‌కు కొత్త ఎస్పీగా నియమించారు.

 >>>>నల్గొండ జిల్లా దేవరకొండ ఎఎస్పీ మౌనిక, ఆదిలాబాద్ కు అడిషనల్ ఎస్పీగా బదిలీ చేశారు..

పాత ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నారని భావించిన లేదా ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం ఒకే చోట ఎక్కువ కాలం పనిచేసిన అధికారులను ఈ బదిలీల్లో భాగంగా కీలక స్థానాల నుంచి మార్చడం జరిగింది.
ఈ బదిలీల ద్వారా రాష్ట్ర పోలీసు వ్యవస్థలో వ్యవస్థాగత మార్పులు తీసుకురావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

తాజావార్తలు