పేదల ఇళ్లను కూలగొట్టి వారి ఆస్తులను ధ్వంసం చేసిన దుర్మార్గపు ప్రభుత్వం ఎక్కడ తప్పించుకోలేదని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు.నల్ల చెరువులో జరిగిన దుర్మార్గాన్ని ఆయన ఖండించారు. అధికారం ఉందని, పోలీసులు ఉన్నారని,తాత జాగీర్ లాగా ఏది పడితే అది చేస్తే చెల్లదు బిడ్డా అని సీఎం రేవంత్ రెడ్డికి ఆయన చరిత్రలో ఇలాంటివారు ఎంతోమంది కాలగర్భంలో కలిసిపోయారు. ప్రజలు తలుచుకుంటే వారి కన్నీళ్లలో కొట్టుకుపోతారని హెచ్చరిస్తున్నాను. ఇక్కడ నష్టపోయిన వారికి అంచనాలు వేసి వారి బ్రతుకులను నిలబెట్టే ప్రయత్నం చేయాలని డిమాండ్ చేస్తూ ఈ చర్యను ఖండిస్తున్నాను.
కూకట్‌పల్లి నల్ల చెరువులో హైడ్రా కూల్చివేతలు చేపట్టిన ప్రాంతాన్ని సందర్శించి, బాధితులను పరామర్శించారుఎంపీ ఈటెల రాజేందర్.షెడ్లను కూలగొట్టటమే కాకుండా, వాటిపై బుల్ డోజర్లు ఎక్కించి కక్ష పూరితంగా వ్యవహరించారని మండిపడ్డారు.పేదల బ్రతుకుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం హీనంగా వ్యవహరిస్తుందని అన్నారు.శని, ఆదివారాల్లో కోర్టులు సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండవని, ఆ రోజుల్లో కూల్చివేతలు చేస్తున్నారా? అని ప్రశ్నించారు. చెరువుల కాపాడలనుకుంటే, ముందుగా చెరువుల్లో ప్రభుత్వ, ప్రైవేటు భూములను లెక్కించాలని ఈటల డిమాండ్ చేశారు.ప్రైవేట్ భూములకు నష్ట పరిహారం చెల్లించి, చెరువులను కాపాడాలన్నారు. కూల్చివేతలలో నష్టపోయిన వారికి ప్రభుత్వం నష్ట పరిహారం చెల్లించాలని చెప్పారు.పేదల పై ఇదే విధంగా వ్యవహరిస్తే, వారు తిరగబడే రోజు వస్తుందని హెచ్చరించారు ఈటల రాజేందర్. చెరువులను కాపాడలనుకుంటే, ముందుగా హుస్సేన్ సాగర్ తో పాటు కలుషితం అయిన అన్ని చెరువులను ప్రక్షాళన చేయాలన్నారు.
షెడ్లు కూలగొట్టి పోలేదు.. అందులో ఉన్న సామాన్లు కూడా డోజర్లతో ధ్వంసం చేస్తున్నారంటే ఎంత కక్షపూరీతంగా, ద్వేషపూరితంగా ఉన్నారో అర్థమవుతుందన్నారు ఈటల రాజేందర్. నీ తాత జాగీరు లెక్క, నువ్వే కొత్తగా ముఖ్యమంత్రి అయినట్టుగా, ఇంతకు ముందు ప్రభుత్వాలు లేనట్టుగా, ఏకలాజికల్ బ్యాలెన్స్ గురించి నువ్వే పట్టించుకున్నట్టుగా చేస్తున్నావని మండిపడ్డారు.
దమ్ముంటే ఈ హైదరాబాదులో ఎన్ని చెరువులు ఉన్నాయి.. ఇందులో ఎన్ని మాయమయ్యాయో లెక్కలు తీయాలన్నారు ఈటల. అంబర్పేటలో బతకమ్మకుంటను ఎవరు మాయం చేశారు.. కృష్ణ కాంత్ పార్క్ ఎలా అయ్యింది.. మసాబ్ ట్యాంక్ చెరువు క్రికెట్ గ్రౌండ్ ఎలా అయిందని ఈటల నిలదీశారు. హుస్సేన్ సాగర్ లో ప్రసాద్ సినీమాక్స్, జలవిహార్ ,పారడైజ్ బిర్యాని సెంటర్ ఇవన్నీ FTLలోనే ఉన్నాయి.. వాటి జోలికి పోయే సాహసం నీకు లేదు..నువ్వు చిన్న వాళ్ళ జోలికి మాత్రమే వస్తున్నావని సీఎం రేవంత్ రెడ్డిపై ధ్వజమెత్తారు ఈటల.