Homeతెలంగాణకార్మిక‌, క‌ర్ష‌క సోద‌రులంద‌రికి మేడే శుభాకాంక్ష‌లు...మాజీ సీఎం కేసీఆర్‌...!

కార్మిక‌, క‌ర్ష‌క సోద‌రులంద‌రికి మేడే శుభాకాంక్ష‌లు…మాజీ సీఎం కేసీఆర్‌…!

హైద‌రాబాద్‌, క్రైమ్ మిర్ర‌ర్‌: అంత‌ర్జాతీయ కార్మిక దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకొని బీఆర్ ఎస్ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి క‌ల్వకుంట్ల చంద్ర‌శేఖ‌ర్ రావు కార్మిక‌, క‌ర్ష‌క లోకానికి మేడే శుభాకాంక్ష‌లు తెలిపారు. ఈ సంద‌ర్భంగా ఉత్పత్తి రంగంలో భాగమై దేశ సంపదను సృష్టిస్తున్న కార్మికుల రెకల కష్టం, వారి త్యాగాలు అమూల్యమైనవని కొనియాడారు. చారిత్రాత్మక మే డే స్ఫూర్తితో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం.. సబ్బండ కులాల, కర్షక, కార్మికుల సంక్షేమం కోసం అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు, ఆదర్శవంతమైన పారిశ్రామిక విధానాలు అమలు చేసిందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు

సింగరేణి, ఆర్టీసీ, భవన నిర్మాణ రంగం సహా పలు రంగాలకు చెందిన కార్మికులు, ఆటో డ్రైవర్లు, దినసరి కూలీలు, అసంఘటిత రంగ కార్మికుల కోసం గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను కేసీఆర్‌ గుర్తు చేశారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో వినూత్న పారిశ్రామిక విధానాల ద్వారా తెలంగాణలో సంపద సృష్టించడంతో లక్షలాది మందికి ఉపాధి అవకాశాలు లభించాయని వివరించారు. నాటి పదేండ్ల ప్రగతి కార్యాచరణను మరింత పటిష్టంగా అమలు చేయడమే రాష్ట్ర కార్మిక లోకానికి మనమిచ్చే గొప్ప కానుక అని పేరొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు