క్రైమ్ మిర్రర్, తెలంగాణ స్టేట్ బ్యూరో: ప్రధాని నరేంద్ర మోదీ మే 10వ తేదీన తెలంగాణలో పర్యటించనున్నారు. ప్రధానిగా మూడోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన రాష్ట్రానికి రావడం ఇదే తొలిసారి. సుమారు రూ. 7,823 కోట్ల నుండి రూ. 8,000 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపనలు మరియు ప్రారంభోత్సవాలు చేయనున్నారు.
AIIMS బీబీనగర్‌లో కొత్త సౌకర్యాలు. MMTS ఫేజ్ 2 విస్తరణ పనులు. జాతీయ రహదారులు మరియు రైల్వే వ్యవస్థ బలోపేతానికి సంబంధించిన ప్రాజెక్టులు. సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌లో మధ్యాహ్నం 3 గంటలకు నిర్వహించనున్న ‘జనాగ్రహ సభ’ లో ప్రధాని పాల్గొని ప్రసంగిస్తారు. కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి ఈ పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
ఆయన బేగంపేట విమానాశ్రయానికి చేరుకుని, అధికారిక కార్యక్రమాల అనంతరం బహిరంగ సభకు హాజరయ్యే అవకాశం ఉంది. ఈ పర్యటన ద్వారా అటు అభివృద్ధికి, ఇటు రాజకీయంగా రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసేందుకు బీజేపీ భారీ ఏర్పాట్లు చేస్తోంది.