హైదరాబాద్, క్రైమ్ మిర్రర్: హైదరాబాద్‌లో ని బహదూర్‌పురాలోని నెహ్రూ జూ పార్క్ సమీపంలో ఉన్న ఓ భారీ స్క్రాప్ గోదాములో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. గోదాములో ప్లాస్టిక్, టైర్లు, ఇతర వస్తువులు ఉండటంతో నిమిషాల వ్యవధిలోనే మంటలు భారీగా వ్యాపించాయి. సమాచారం అందుకున్న వెంటనే బహదూర్‌పురా పోలీసులు, అగ్నిమాపక శాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
గోదాములోని విద్యుత్ వైరింగ్‌లో ఏర్పడిన సాంకేతిక లోపం వల్ల మంటలు చెలరేగి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఈ ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం సంభవించినట్లు తెలుస్తోంది. లక్షల రూపాయల విలువైన స్క్రాప్ వస్తువులు కాలిబూడిదయ్యాయని సమాచారం. ఈ ఘటనలో అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ప్రమాదం జరిగిన ప్రాంతం నెహ్రూ జూ పార్క్‌కు అతి సమీపంలో ఉండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు.