అమరావతి, క్రైమ్ మిర్రర్: అంతర్జాతీయ కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకొని కర్షక, కార్మిక సోదరులందరికి సీఎం చంద్రబాబు నాయుడు మేడే శుభాకాంక్షలు తెలిపారు. సోషల్ మీడియా ఎక్స్‌వేదికగా కార్మికులు, కర్షకులు కలిసి నడుస్తే దేశం ప్రగతి పథంలో ముందుకు సాగుతుందని తెలిపారు. అదే విధంగా కార్మికుల కోసం సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని తెలిపారు.
ఎక్స్ వేదికగా చంద్రబాబు ట్వీట్…
కార్మిక దినోత్సవం సందర్భాన్ని పురస్కరించుకొని వృత్తి ఏదైనా శ్రమించే ప్రతి మనిషికి సమాన గౌరవం ఇవ్వడం మన కర్తవ్యం. అహర్నిశలు శ్రమిస్తున్న శ్రామిక వర్గ హక్కులను గుర్తించే చారిత్రాత్మక దినోత్సవం ఇది. దేశ ఆర్థిక పురోగతికి వెన్నెముక అయిన వ్యవసాయం ముందుకు వెళ్తుందంటే రైతులు, రైతు కూలీల శ్రమ శక్తే కారణం. కార్మికులు, కర్షకులు కలిసి నడిస్తేనే దేశం ప్రగతి పథంలో ముందుకు వెళుతుంది. కూటమి ప్రభుత్వం కార్మిక లోకం కోసం ఎన్నో సంక్షేమ, అభివృద్ధి పథకాలను అమలు చేస్తోంది’ అంటూ చంద్రబాబు ఎక్స్‌లో పోస్ట్ చేశారు.