ఆంధ్ర ప్రదేశ్

అమరావతి మహిళలపై సజ్జల తీవ్ర వ్యాఖ్యలు, నిప్పులు చెరిగిన షర్మిళ!

Sajjala Ramakrishna Reddy Comments: అమరావతి మహిళలపై సాక్షి ఛానెల్‌ లో జర్నలిస్టు కృష్ణంరాజు చేసిన అసభ్యకర వ్యాఖ్యలపై ఆందోళన చేపట్టిన మహిళలపై వైసీపీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ఆఫీస్ లో మీడియాతో మాట్లాడిన ఆయన.. పిశాచాలు కూడా ఇలా చేయరేమో? అన్నారు. సదరు మహిళలను రాక్షసులు అని కూడా అనలేమన్నారు. అందరూ కలిసి సంకరం అయినట్టుందంటూ పరుష పదజాలాన్ని వాడారు. ఇవన్నీ కలిసి తయారైన తెగ ఏదో ఒకటున్నట్టుందన్నారు. ఆ తెగ పూనుకుంటే మాత్రమే ఇలా చేస్తుందంటూ మండిపడ్డారు. పూర్తిగా సమన్వయంతో కమ్ముకుని ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారని, వ్యవస్థీకృతంగా చేస్తున్న నిరసన ప్రదర్శనలంటూ అని సజ్జల పరుష వ్యాఖ్యలు చేశారు.

సజ్జల వ్యాఖ్యలపై షర్మిళ ఆగ్రహం

అమరావతి మహిళలను ఉద్దేశించి సజ్జల రామకృష్ణా రెడ్డి చేసిన ఏపీపీసీ అధ్యక్షురాలు షర్మిళ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.   మహిళల గురించి సజ్జల చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు. ఆయనో మూర్ఖుడిలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మహిళలను పిశాచులతో పోల్చుతారా? మహిళలను రాక్షసులు అంటారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.  సంకర జాతి అని మహిళలను అవమానించడం దారుణం అన్నారు.

డీజీపీకి రఘురామ రాజు ఫిర్యాదు

అటు అమరావతి రాజధాని ప్రాంత మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైకాపా నేత సజ్జల రామకృష్ణారెడ్డిపై చర్యలు తీసుకోవాలని ఏపీ డిప్యూటీ స్పీకర్‌ రఘు రామ కృష్ణ రాజు డీజీపీకి  ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఆయన లేఖ రాశారు. ఆయన వ్యాఖ్యలు అమరావతిలోని వేలాది మంది మహిళల మనోభావాలను దెబ్బతీశాయన్నారు. సజ్జల మీద ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలని లేఖలో కోరారు. భవిష్యత్తులో ఇలాంటి అవమానకర భాషను వాడాలంటేనే భయం కలిగేలా కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. వైసీపీ నేతలు అమరావతిని, అమరావతి ప్రాంత ప్రజలపై మొదటి నుంచి అనుచుతి వ్యాఖ్యలు చేస్తున్నారనే విషయాన్ని రఘురామ గుర్తు చేశారు.

Read Also: కాంగ్రెస్ ఎమ్మెల్యే వసూళ్ల దందా, మందుల సామేల్ వీడియో వైరల్!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button