
Retired Jawan Arrested: ఆర్మీలో పని చేసిన వారికి క్రమ శిక్షణ ఎక్కువగా ఉంటుంది. దేశ భక్తి నరనరాన నిండి ఉంటుంది. సరిహద్దుల్లోనే కాదు, దేశం లోపల కూడా అక్రమాలు జరగకూడదని భావిస్తారు. కానీ, కొంత మంది ఆర్మీలో పని చేసినా, బుద్ది వక్రంగానే ఉంటుంది. డబ్బుల కోసం అడ్డదారులు తొక్కే మహానుభావులూ ఉన్నారు. తాజాగా హైదరాబాద్ లో ఇలాంటి ఘటనే జరిగింది. ఓ మాజీ జవాన్ అక్రమంగా ఆర్మీ మద్యం రవాణా చేస్తూ శేరిలింగంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో పట్టుపడ్డాడు. అతడి నుంచి సుమారు 27 పైగా 100 పైపర్స్ విస్కీ బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
వాహనాల తనిఖీ సందర్భంగా పట్టుబడ్డ ఆర్మీ మాజీ జవాన్
తాజాగా శంషాబాద్ డీపీఈవో ఆదేశాల ప్రకారం మియాపూర్ నుంచి బాచుపల్లి వరకు శేరిలింగంపల్లి ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ బి లక్ష్మణ్ గౌడ్ ఆధ్వర్యంలో రూట్ వాచ్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు చోట్ల వాహనాలను తనికీ చేశారు. ఈ నేపథ్యంలో మౌలాలికి చెందిన ఉప్పే మదన్ మోహన్ రావు వాహనాన్ని చెక్ చేశారు. అతడి వాహనంలో ఏకంగా 27 ఆర్మీ మద్యం బాటిళ్లు లభించాయి. అవన్నీ 100 పైపర్స్ బాటిళ్లుగా గుర్తించారు. వీటి విలువ సుమారు రూ. 24,300 ఉంటుందని తెలిపారు.
తక్కువ ధరకు తెచ్చి ఎక్కువ ధరకు అమ్మకం
మదన్ మోహన్ రావు ఎక్స్ సర్వీస్ మెన్ గా పోలీసులు గుర్తించారు. అతడికి ఆర్మీ అధికారులతో ఉన్న సంబంధాలతో మద్యం బాటిళ్లను కొనుగోలు చేసి, వాటిని ఎక్కువ ధరకు బయట అమ్ముతున్నట్లు గుర్తించారు. ఆయన చాలా కాలంగా ఈ వ్యవహారం నడిపిస్తున్నట్లు తెలుస్తుంది. తాజాగా అతడిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసినట్లు ఎక్సైజ్ పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు. త్వరలోనే ఆయనను విచారించి, ఈ వ్యవహారం వెనుక ఎవరెవరు ఉన్నారే విషయాన్ని బయటకు తీస్తామని వెల్లడించారు.
Read Also: కాంగ్రెస్ ఎమ్మెల్యే వసూళ్ల దందా, మందుల సామేల్ వీడియో వైరల్!