క్రైమ్ మిర్రర్, తెలంగాణ స్టేట్ బ్యూరో: ప్రధాని నరేంద్ర మోదీ మే 10 (ఆదివారం) తేదీన హైదరాబాద్‌లో పర్యటించనున్నారు. భద్రతా కారణాల దృష్ట్యా ఆ రోజున నగరంలోని పలు ప్రాంతాలలో డ్రోన్లు, పారాగ్లైడర్లు మరియు రిమోట్ కంట్రోల్డ్ మైక్రో-లైట్ ఎయిర్‌క్రాఫ్ట్‌ల ఎగురవేతపై పోలీసులు నిషేధం విధించారు. మే 10 అర్ధరాత్రి నుండి తిరిగి అదే రోజు అర్ధరాత్రి వరకు 24 గంటల పాటు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయి.
హైటెక్ సిటీలో నూతనంగా నిర్మించిన ‘సింధు హాస్పిటల్’ ప్రారంభోత్సవం మరియు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించనున్న బహిరంగ సభ. మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిమితులు మరియు ఐటీ కారిడార్ ప్రాంతాలు. బేగంపేట, బోయిన్‌పల్లి, మరియు మారేడ్‌పల్లి పోలీస్ స్టేషన్ల పరిధిలోని ప్రాంతాలను ‘నో ఫ్లయింగ్ జోన్’గా ప్రకటించారు. ఈ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై భారతీయ నాగరిక సురక్ష సంహిత (BNSS) సెక్షన్ 163 కింద కఠిన చర్యలు తీసుకోబడతాయని అధికారులు హెచ్చరించారు.