ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్ వసంత్ విహార్ ఫేజ్-2 ప్రాంతంలో పట్టపగలే చోరీ ఘటన చోటుచేసుకుంది. ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్న ఓ మహిళను టార్గెట్ చేసిన దుండగులు.. ఆమె మెడలో ఉన్న బంగారు గొలుసును లాక్కొని అక్కడి నుంచి పరారయ్యారు.
సాయంత్రం సుమారు 5 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్లు సమాచారం. మహిళ రోడ్డుపై వెళ్తుండగా దుండగులు ఆమెను వెంబడించి అదను చూసుకుని గొలుసు తెంచుకున్నట్లు తెలుస్తోంది. ఈ మొత్తం ఘటన సమీపంలోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డైంది.
ఇదే ప్రాంతంలో 24 గంటల వ్యవధిలో రెండోసారి ఇలాంటి చోరీ జరగడంతో స్థానికుల్లో ఆందోళన పెరిగింది. వరుస ఘటనల నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్న పోలీసులు.. నిందితుల గుర్తింపు కోసం దర్యాప్తు చేపట్టారు.
పట్టపగలే మహిళలను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడుతున్న దుండగులను త్వరగా పట్టుకోవాలని స్థానికులు పోలీసులను కోరుతున్నారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం గాలింపు ముమ్మరం చేశారు.
also read: స్వాతంత్య్ర వేడుకల ఏర్పాట్లలో విషాదం.. విద్యుత్ షాక్‌తో టీచర్ మృతి
