ఆహార కల్తీపై ఉక్కుపాదం మోపేందుకు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) సిద్ధమైంది. ముఖ్యంగా పాల ఉత్పత్తులైన పనీర్ పేరుతో జరుగుతున్న నకిలీ దందాకు చెక్ పెట్టేందుకు కీలక అడుగు వేసింది. దేశవ్యాప్తంగా అనలాగ్ (ఆర్టిఫిషియల్) పనీర్ తయారీతో పాటు, వాటి అమ్మకాలను పూర్తిగా నిషేధించాలని FSSAI ప్రతిపాదించింది. ప్రస్తుత రోజుల్లో కృత్రిమంగా తయారు చేసిన అనలాగ్ ఉత్పత్తులను ప్యాక్ చేసి, వాటిని అసలైన ‘పనీర్’ పేరుతో మార్కెట్లో విక్రయిస్తున్న పద్ధతి విపరీతంగా పెరిగిపోయింది. ఈ మోసపూరిత విధానాన్ని బ్యాన్ చేయాలని FSSAI తన ప్రతిపాదనలో సూచించింది. ఈ మేరకు నకిలీ పనీర్ నియంత్రణ కోసం రూపొందించిన డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌ను పబ్లిక్ డొమైన్‌లో ఉంచింది. ఈ చట్టం అమలుపై ప్రజలు, ఆహార నిపుణులు, వ్యాపార వర్గాల నుంచి సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరింది.
ఇదిలా ఉండగా, ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని తెలంగాణ రాష్ట్రం ఇప్పటికే అనలాగ్ పనీర్‌పై నిషేధం అమలు చేస్తోంది. తెలంగాణతో పాటుగా దేశంలోని మరో ఏడు రాష్ట్రాలు కూడా ఈ ఆర్టిఫిషియల్ పనీర్‌ను ఇప్పటికే నిషేధించాయి. ఇప్పుడు FSSAI తెచ్చిన ఈ కొత్త ప్రతిపాదన ఆమోదం పొందితే, దేశమంతటా కల్తీ పనీర్ తయారీదారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి బలమైన మార్గం ఏర్పడుతుంది. తద్వారా ప్రజల ఆరోగ్యానికి మరింత భరోసా దక్కుతుంది.
దాయాది దేశానికి డిఫెన్స్ మినిస్టర్ స్ట్రాంగ్ వార్నింగ్..!
