భారతదేశ భద్రత, సరిహద్దుల రక్షణ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ దాయాది దేశం పాకిస్థాన్‌కు మరోసారి తీవ్ర స్థాయిలో హెచ్చరికలు జారీ చేశారు. తాజాగా జరిగిన ప్రతిష్టాత్మక డిఫెకాన్-2026 (DEFCON-2026) కార్యక్రమంలో పాల్గొన్న ఆయన పాక్ తీరుపై నిప్పులు చెరిగారు. అణ్వాయుధాల పేరుతో పాకిస్థాన్ తరచుగా చేసే న్యూక్లియర్ బ్లాక్‌మెయిల్‌ను భారత్ ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోదని, ఈ విషయాన్ని తాము చేపట్టిన ‘ఆపరేషన్ సింధూర్’ ద్వారా ఇప్పటికే వారికి స్పష్టం చేశామని ఆయన తేల్చిచెప్పారు.
సరిహద్దుల్లో శాంతిని ఉల్లంఘిస్తూ పాక్ వైపు నుంచి జరిగే ఎలాంటి చిన్న శత్రుపూరిత చర్యలకైనా భారత్ దీటుగా బదులిస్తుందని రాజ్‌నాథ్ హెచ్చరించారు. అటువంటి కుట్రపూరిత చర్యలను భారత్ కచ్చితంగా యుద్ధంగానే పరిగణిస్తుందని, దానికి తగిన విధంగానే తమ రియాక్షన్ అత్యంత కఠినంగా ఉంటుందని ఆయన ఈ వేదికగా స్పష్టం చేశారు.ద్వైపాక్షిక సంబంధాల గురించి మాట్లాడుతూ.. ఒకవైపు ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ మరోవైపు శాంతి చర్చలు జరపడం ఏమాత్రం సాధ్యం కాదన్నారు. ఉగ్రవాదం-చర్చలు, ఉగ్రవాదం-వాణిజ్యం ఎప్పటికీ కలిసి సాగవని ఆయన కుండబద్దలు కొట్టారు. “రక్తం, నీరు ఎప్పటికీ ఒకేసారి కలిసి ప్రవహించలేవు” అని ప్రస్తావించిన ఆయన.. సింధూ నదీ జలాల నిలిపివేత నిర్ణయంతోనే భారత్ తన కఠిన వైఖరిని పాకిస్థాన్‌కు స్పష్టం చేసిందని పేర్కొన్నారు.
అపోలో హాస్పిటల్స్‌లో ఉపాసనకు బిగ్ రెస్పాన్సిబిలిటీ.. ‘డైరెక్టర్-ప్రాజెక్ట్స్’గా నూతన బాధ్యతలు!
