క్రైమ్ మిర్రర్,తెలంగాణ:- గత కొంతకాలంగా సరైన వర్షాలు లేక ఎదురుచూస్తున్న తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త తెలిపింది. గత రెండు రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు చోటుచేసుకున్నాయి. పలు చోట్ల విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో వాతావరణం చల్లబడింది. దీంతో అటు సాగు పనులకు సిద్ధమవుతున్న రైతులు, ఇటు ఉక్కపోతతో అల్లాడిపోతున్న సామాన్య ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
రాబోయే రోజుల్లోనూ ఈ వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాతావరణ పరిస్థితుల కారణంగా ఈ రోజు (బుధవారం) లేదా రేపు మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. ఈ అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో రానున్న మరో నాలుగు రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు.
ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్
రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో, వాతావరణ శాఖ ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. నేడు ఆదిలాబాద్, కుమ్రంభీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో వర్షాలు పడతాయని అంచనా వేస్తున్నారు.ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే తప్ప బయటకు రావొద్దని అధికారులు సూచిస్తున్నారు.
నీట్‌ను పూర్తిగా రద్దు చేయాలి.. కేంద్రానికి TVK డిమాండ్!