Homeఅంతర్జాతీయంUnion Budget 2026: ఇరాన్‌ చాబహార్‌ పోర్టుకు నో బడ్జెట్, కేంద్రం కీలక నిర్ణయం!

Union Budget 2026: ఇరాన్‌ చాబహార్‌ పోర్టుకు నో బడ్జెట్, కేంద్రం కీలక నిర్ణయం!

No Funds for Chabahar Port Project:  అమెరికా ఆంక్షల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తాజా బడ్జెట్‌లో కీలక మార్పు తీసుకొచ్చింది. ఇరాన్‌లో అభివృద్ధి చేస్తున్న చాబహార్ పోర్టుకు తాజా బడ్జెట్‌లో కేంద్రం ఎలాంటి కేటాయింపులూ చేయలేదు. ఇరాన్, అమెరికా మధ్య ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరిన నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.

వాణిజ్యపరంగా భారత్ కు చాబహార్‌ పోర్టు కీలకం

వాణిజ్యపరంగా చాబహార్‌ పోర్టు భారత్‌కు ఎంతో కీలకం . పాక్‌తో చిక్కులు లేకుండా ఈ పోర్టు ద్వారా భారత వాణిజ్యం ఇరాన్, అప్ఘానిస్థాన్ మీదుగా మధ్య ఆసియా దేశాల వరకూ విస్తరించింది. పోర్టు అభివృద్ధికి భారత్ గత కొన్నేళ్లుగా ఏటా సగటున రూ.100 కోట్ల వరకూ కేటాయిస్తోంది. పాక్‌లోని గ్వదార్ పోర్టును  చైనా అభివృద్ధి చేస్తుంటే భారత్ తన దృష్టి చాబహార్ పోర్టుపై పెట్టింది. పాశ్చాత్య ఆంక్షలను తట్టుకుని నిలబడేందుకు ఈ పోర్టు ఇరాన్‌కూ కీలకమే. ఈ పోర్టు ద్వారా ఇరాన్‌కు అనేక ప్రత్యామ్నాయ వాణిజ్య మార్గాలు అందుబాటులో ఉంటాయి.

5 దశాబ్దాలుగా చాబహార్ పోర్టు అభివృద్ధి

చాబహార్ పోర్టు అభివృద్ధిపై భారత్ దాదాపు 2 దశాబ్దాలుగా కృషి చేస్తోంది. 2002లో తొలిసారిగా ఈ పోర్టు విషయంలో భారత్, ఇరాన్ మధ్య చర్చలు మొదలయ్యాయి. ఆ మరుసటి ఏడాది ఇరు దేశాల మధ్య సహకారం కోసం ఒప్పందం కుదిరింది. ఆ తరువాత 1996లో అఫ్గానిస్థాన్ తాలిబాన్ల పరమయ్యాక పరిణామాలు వేగంగా మారాయి. అప్పట్లో తాలిబాన్లను వ్యతిరేకించిన భారత్, ఇరాన్ మధ్య దౌత్య బంధం మరింత బలపడింది. ఇక పాక్‌లోని గ్వదార్ పోర్టుపై చైనా దృష్టిపెట్టాక భారత్ చాబహార్ పోర్టుకు మరింత వ్యూహాత్మక ప్రాధాన్యమిచ్చింది. అయితే, ఇరాన్ అణుకార్యకలాపాలు చేపడుతోందని ఆరోపిస్తూ అమెరికా గతేడాది సెప్టెంబర్‌లో ఆర్థిక ఆంక్షలకు తెరతీసింది. భారత్‌కు మాత్రం ఆరు నెలల పాటు మినహాయింపును ఇచ్చింది. ఈ గడువు ఏప్రిల్ 26తో ముగియనుంది.

Anjibabu Chittimalla
Anjibabu Chittimallahttps://crimemirror.com/
గత 15 సంవత్సరాలుగా మీడియా రంగంలో పని చేస్తున్నాను. ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నాను.

తాజావార్తలు