Homeఅంతర్జాతీయంఇకపై 16 ఏండ్లలోపు పిల్లలకు నో ఎనర్జీ డ్రింక్స్‌!

ఇకపై 16 ఏండ్లలోపు పిల్లలకు నో ఎనర్జీ డ్రింక్స్‌!

UK Ban Energy Drinks For Children: ఎనర్జీ డ్రింక్స్ తో పిల్లల్లో పలు అనారోగ్య సమస్యలు తలెత్తుతున్న నేపథ్యంలో యూకే ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 16 ఏండ్ల లోపు పిల్లలకు ఎనర్జీ డ్రింక్‌ల అమ్మకంపై నిషేధం విధించాలని భావిస్తోంది. లీటర్‌ కూల్ డ్రింక్ లో 150 ఎంజీల కెఫిన్‌ కలిగి ఉన్న అన్ని డ్రింక్‌ లను ఇకపై పిల్లలకు అమ్మరు. రెడ్‌ బుల్‌, మాన్‌ స్టర్‌, రెలెంట్‌ లెస్‌, ప్రైమ్‌ తదితర డ్రింక్‌ లు ఈ విభాగం కిందకు వస్తాయి. కోకా కోల, పెప్సీ, డైట్‌ కోక్‌, కాఫీ, టీ లాంటి డ్రింక్స్ ఈ నిషేధ జాబితా పరిధిలోకి రావు.

పిల్లలకు ఎందుకు అమ్మకూడదంటే?

పిల్లల్లో ఊబకాయం, నిద్రలేమి, ఒత్తడి వంటివి తగ్గించడంతో పాటు గత ఏడాది ఎన్నికల సందర్భంగా లేబర్‌ పార్టీ ఇచ్చిన ఎన్నికల వాగ్దానం మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోనుంది. అత్యధిక కెఫిన్‌ ఉన్న ఇలాంటి పానీయాలను పిల్లలకు అమ్మకుండా నిషేధం విధించడం వల్ల వారిలో శారీరక, మానసిక ఒత్తిడి తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. ఈ సమస్యలను తగ్గించేందుకు గాను..  యూకే ప్రభుత్వం తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది.

Anjibabu Ch
Anjibabu Chhttps://crimemirror.com/
గత 15 సంవత్సరాలుగా మీడియా రంగంలో ఉన్నారు. పలు ప్రముఖ మీడియా సంస్థల్లో పని చేశారు. ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నారు. రాజకీయాల నుంచి సినిమాల వరకు.. నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ వరకు.. స్పోర్ట్స్ నుంచి క్రైమ్ వరకు అన్ని రకాల కథనాలు అందిస్తున్నారు.

తాజావార్తలు