Homeతెలంగాణరాష్ర్టంలో ఐఏఎస్ అధికారుల బదిలీలు...!

రాష్ర్టంలో ఐఏఎస్ అధికారుల బదిలీలు…!

హైద‌రాబాద్‌, క్రైమ్ మిర్ర‌ర్: తెలంగాణ రాష్ర్ట ప్ర‌భుత్వం ప‌రిపాల‌న‌లో కీల‌క‌మార్పు చేస్తూ భారీ స్థాయిలో ఐఏఎస్ అధికారుల‌ను బ‌దిలీ చేస‌ది. పలువురు అధికారులను బదిలీ చేయగా మరికొంత మందికి కొత్తగా పోస్టింగులు ఇచ్చారు. ఈ మేరకు శనివారం రాత్రి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. సెక్రటరీలు, జిల్లా కలెక్టర్లు , జీహెచ్‌ ఎంసీ జోనల్ కమిషనర్లతో సహా పలువురు ఉన్నతాధికారులకు కొత్తగా బాధ్యతలు అప్పగించారు.

కొత్త‌గా బాద్య‌త‌లు…

వీరిలో పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక కార్యదర్శిగా దాన కిశోర్, ఆరోగ్య శ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ సీఈఓగా హనుమంతు, కార్మిక శాఖ సెక్రటరీగా దాసరి హరిచందన అలాగే ఇంటర్మీడియట్​ బోర్డు డైరెక్టర్‌ గా అభిలాష అభినవ్‌, పరిశ్రమల శాఖ ప్రత్యేక కార్యదర్శిగా కృష్ణా ఆదిత్య, గిరిజన సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శిగా బీఎం సంతోష్‌, పౌర సరఫరాల శాఖ డైరెక్టర్‌గా జీవీ శ్యామ్‌ప్రసాద్‌ లాల్‌ నియమితులయ్యారు.

 

 

తాజావార్తలు