Homeతెలంగాణజెన్ జీ 'ధర్మం' గెలిచింది...!

జెన్ జీ ‘ధర్మం’ గెలిచింది…!

  • కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా

  • ఉద్యమంతో విద్యార్థులు, నిరుద్యోగులు గట్టి సవాల్

  • తలొగ్గిన కేంద్రం

క్రైమ్ మిర్రర్, సెంట్రల్ డెస్క్: విద్యార్థుల పోరాటానికి ఎట్టకేలకు కేంద్రం తలవొంచింది. దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు, నిరుద్యోగ యువత చేపట్టిన చారిత్రాత్మక పోరాటానికి కేంద్రం తలవంచక తప్పలేదు. సంచలనం సృష్టించిన నీట్ ప్రశ్నపత్రాల లీకేజీ, విద్యావ్యవస్థలోని లోపాలపై యువతరం ఉవ్వెత్తున ఎగసి పడింది. ఆందోళన కార్యక్రమాలు చేపట్టింది. దీనిపై కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేయక తప్పలేదు. ఈ మేరకు ఆయన తన రాజీనామా లేఖను ప్రధాని నరేంద్ర మోడీకి పంపించారు. సోషల్ మీడియా వేదికగా ప్రారంభమై.. వీధుల దాకా వ్యాపించిన జెన్ జీ తీవ్ర నిరసనల ముందు, యువత ఆగ్రహానికి కేంద్ర క్యాబినెట్ మంత్రి రాజీనామా చేయని తప్పని పరిస్థితి ఏర్పడింది.

కొద్ది రోజులుగా ఉద్యమం…

Also Read:వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్య సంచలన ప్రకటన!

గత కొద్దిరోజులుగా విద్యార్థులతో పాటు నిరుద్యోగ యువత పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు జరిపింది. దాని ఫలితమే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా. ఆయన తన రాజీనామాలు నైతిక బాధ్యతను ప్రస్తావించారు. బలమైన విద్యావ్యవస్థ సమర్థవంతమైన దేశానికి పునాదిగా అభివర్ణించారు. జంతర్ మంతర్ వద్ద చోటు చేసుకున్న పరిణామాలు, దేశవ్యాప్తంగా చెలరేగిన ఆందోళనల దృష్ట్యా అసమ్మతిని, దేశ వ్యతిరేక శక్తులు ఈ పరిస్థితిని దుర్వినియోగం చేయకూడదని, విద్యార్థులు చట్టపరమైన చిక్కుల్లో చిక్కుకోకుండా తన భవిష్యత్తుపై దృష్టి పెట్టాలనే ఉద్దేశంతోనే తన పదవి నుంచి వైదొలుగుతున్నట్లు ధర్మేంద్ర ప్రధాన్ స్పష్టం చేశారు. నీట్ వ్యవహారంలో జరిగిన అక్రమాలపై తొలి రోజు నుంచి తాను బాధ్యత వహించానని.. ఏ ఒక్క ప్రతిభావంతుడైన విద్యార్థికి అన్యాయం జరగకూడదనే సంకల్పంతో సిబిఐ విచారణ, రీ టెస్ట్ నిర్ణయాలను తీసుకున్నానని చెప్పుకొచ్చారు. దేశ యువత అయోమయంలో, గందరగోళంలో చిక్కుకోకూడదన్న ఏకైక లక్ష్యంతో తన రాజీనామా చేస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు.

భారీ ఆందోళనలు…

Also Read:ఏపీకి వాయుగుండం ముప్పు..ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు, ఈదురుగాలులు – APSDMA హెచ్చరిక

నీట్ పేపర్ లీకేజీ వ్యవహారం వెలుగులోకి వచ్చిన తర్వాత .. జెన్ జి తిరుగుబాటు ప్రారంభం అయింది. పరీక్ష కేంద్రాల ముందు, సోషల్ మీడియా హాష్ ట్యాగులలో కాకుండా.. ప్రభుత్వ నిరంకుశ వైఖరిని, విద్యాశాఖ అలసత్వాన్ని నేరుగా ప్రశ్నిస్తూ యువత జరిపిన సమరానికి ఈ రాజీనామా ఒక పెద్ద విజయం. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వార్త రాగానే భారత యువతరంలో సరికొత్త నినాదం మొదలైంది. జెన్ జి గొంతుకను, వారి ఆక్రోసాన్ని తేలిగ్గా తీసుకుంటే ఏ ప్రభుత్వానికైనా ఇదే గతి పడుతుందని మోడీకి ఇప్పటికైనా అర్థమై ఉంటుందని విపక్షాలు భావిస్తున్నాయి.. అయితే అప్రతిహస విజయంతో దూసుకు వెళ్తున్న ఎన్డీఏ, భారతీయ జనతా పార్టీకి ఇది గొడ్డలి పెట్టు లాంటిది. దీంతో మరింత దూకుడు పెంచాలని విపక్షాలు భావిస్తాయి. ఇది ఒక ప్రమాద ఘంటిక అని భావించాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు