Homeక్రైమ్విషాదం.. రైల్వే ట్రాక్ దాటుతుండగా ముగ్గురిని ఢీకొట్టిన రైలు

విషాదం.. రైల్వే ట్రాక్ దాటుతుండగా ముగ్గురిని ఢీకొట్టిన రైలు

రైల్వే స్టేషన్‌లో జరిగిన విషాదకర ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. దొడ్డబల్లాపుర రైల్వే స్టేషన్‌లో సోమవారం ఉదయం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. రైల్వే ట్రాక్ దాటుతున్న ఓ మహిళతో పాటు ఇద్దరు బాలికలను రైలు ఢీకొట్టింది.

ఈ ఘటనలో హిందూపురానికి చెందిన ఇర్ఫానా (46), రుకియా (13), రాకియా (8) అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు. మృతులు ముగ్గురూ ఆదివారం బంధువుల ఇంటికి వచ్చినట్లు సమాచారం. సోమవారం తిరిగి స్వస్థలానికి వెళ్లేందుకు సిద్ధమవుతున్న సమయంలో రైల్వే ట్రాక్ దాటుతుండగా ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు.

సమాచారం అందుకున్న యలహంక రైల్వే పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్నారు. ప్రమాదానికి సంబంధించిన వివరాలను సేకరించి, మృతదేహాలను తదుపరి చర్యల కోసం తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

రైల్వే ట్రాక్‌లను దాటే సమయంలో ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని, నిర్ణీత ఫుట్‌ఓవర్ బ్రిడ్జిలు లేదా ఇతర సురక్షిత మార్గాలను మాత్రమే వినియోగించాలని అధికారులు సూచిస్తున్నారు.

also read: ఏపీలో కానిస్టేబుల్‌పై కత్తితో దాడి.. ఇద్దరు నిందితులు పరార్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు