HomeUncategorizedమలక్ పేట లో ట్రాఫిక్ సేఫ్టీ అవగాహన

మలక్ పేట లో ట్రాఫిక్ సేఫ్టీ అవగాహన

  • వాహ‌న‌దారుడు త‌ప్ప‌నిస‌రిగా హెల్మెట్ ధ‌రించాలి
  • మ‌ద్యం సేవించి వాహ‌నం న‌డిపితే చ‌ట్ట‌రీత్య నేరం

హైదరాబాద్, క్రైమ్ మిర్ర‌ర్ : నేషనల్ రోడ్డు సేఫ్టీ – ట్రాఫిక్ పోలీసుల అవగాహనా కార్యక్రమంలో భాగంగా నేషనల్ రోడ్డు సేఫ్టీ సందర్భంగా మలక్ పేట్ ట్రాఫిక్ పోలీసులు వాహనదారులకు అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రోడ్డు భద్రత, ట్రాఫిక్ నియమాల ప్రాముఖ్యత, అలాగే మనిషి విలువైన జీవితం గురించి వివ‌రించారు. ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ సిగ్న‌లు్ల‌ కచ్చితంగా పాటించాలనిసూచించారు.

హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాలు న‌డిపితే చ‌ట్ట రీత్య‌నేర‌మ‌ని తెలిపారు. సీటు బెల్ట్ త‌ప్ప‌ని స‌రి ధ‌రించాల‌ని కోరారు. ఓవర్ స్పీడ్, సెల్ ఫోన్ వినియోగం ప్రమాదాలకు దారి తీస్తాయని అన్నారు.ఒక చిన్న నిర్లక్ష్యం పెద్ద ప్రమాదానికి కారణమవుతుంది. కుటుంబ సభ్యులు మన కోసం ఎదురుచూస్తుంటారు. కాబట్టి సురక్షితంగా ఇంటికి చేరుకోవడం మన బాధ్యత తెలిపారు.

డబ్బు, వస్తువులు తిరిగి సంపాదించవచ్చు. కానీ ఒకసారి కోల్పోయిన ప్రాణం తిరిగి రాద‌ని తెలిపారు.ఈ సంద‌ర్భంగా ట్రాఫిక్ పోలీసులు ప్రజలకు పాంప్లెట్లు పంపిణీ చేసి, రూల్స్ పాటించాలని విజ్ఞప్తి చేశారు. రు. ఈ కార్యక్రమం లో మలక్ పేట్, సైదాబాద్ ఏసీపీ, ఇన్స్‌పెక్టర్స్, ట్రాఫిక్ పోలీసులు, సిబ్బంది పాల్గొన్నారు.

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

తాజావార్తలు