Homeతెలంగాణబహుదూర్ గూడ భూముల రచ్చ...!

బహుదూర్ గూడ భూముల రచ్చ…!

  • దశాబ్దాలుగా కొందరి చేతుల్లో ప్రభుత్వ భూమి

  • తమదేనంటున్న ఆక్రమణదారులు

  • ఎకరాకు రూ. 3 కోట్ల పరిహారం డిమాండ్

క్రైమ్ మిర్రర్, హైదరాబాద్: తెలంగాణలో బహుదూర్ గూడ భూములు పై ఇప్పుడు పెద్ద చర్చ నడుస్తోంది. హైదరాబాద్ శివారులోని శంషాబాద్ పరిధిలో ఈ భూములు ఉన్నాయి. అక్కడ ప్రభుత్వం బుల్లెట్ ట్రైన్ డిపోల నిర్మాణం కోసం భారీగా భూ సేకరణ చేపడుతోంది అంటూ విస్తృతంగా ప్రచారం నడుస్తోంది. కానీ క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే అక్కడ జరుగుతున్నది భూ సేకరణ కాదు. చాలా సంవత్సరాలుగా కబ్జా కోరల్లో ఉన్న ప్రభుత్వ భూములను హైడ్రా సంరక్షిస్తోంది. స్వాధీనం చేసుకొని కంచ వేస్తోంది. చెరువుల ఎఫ్ టి ఎల్, బఫర్ జోన్లతో పాటు విలువైన ప్రభుత్వ స్థలాలను కాపాడే యాక్షన్ ప్లాన్ లో భాగంగానే.. హైడ్రా ఈ చర్యలకు దిగింది.

మింగుడు పడని అంశం…

Also Read:డ్యాన్సర్స్ అసోసియేషన్ వివాదానికి ముగింపు.. జానీ మాస్టర్‌పై నిషేధం ఎత్తివేత

దశాబ్దాల కాలంగా ఆ భూములను వినియోగించుకుంటున్నారు కొందరు ప్రైవేటు వ్యక్తులు. ఒకవైపు సాగు, మరోవైపు వ్యాపార అవసరాలకు వాడుకుంటున్నారు. ఇప్పుడు హైడ్రా రంగంలోకి దిగి ఆ భూములను స్వాధీనం చేసుకోవడం వారికి మింగుడు పడడం లేదు. తరతరాలుగా తాము అనుభవిస్తున్న భూములు తమ చేతులు దాటిపోతుండడంతో హైడ్రా సిబ్బందితో పాటు అధికారులపై దాడికి దిగినంత ప్రయత్నం చేస్తున్నారు. చట్టబద్ధంగా చూస్తే ఈ భూములపై ఆయా వ్యక్తులకు ఎలాంటి అధికారిక హక్కులు లేవు. ప్రభుత్వ పట్టాలు కానీ.. హక్కు పత్రాలు కానీ లేవని రెవెన్యూ రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. అవి ముమ్మాటికి ప్రభుత్వ ఆధీనంలో ఉండాల్సిన భూములే.

పరిహారానికి డిమాండ్…

Also Read:హైదరాబాద్‌లోని దోమలగూడ ప్రాంతంలో ముగ్గురు బాలికలు అదృశ్యం.. గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు

గత కొంతకాలంగా తమ ఆధీనంలో ఉండడంతో ఆ భూములు తమవేనని చాలామంది భావిస్తున్నారు. అందుకే ఆ భూములు ఖాళీ చేయాలంటే ఎకరానికి మూడు కోట్లు భారీ పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రతిష్టాత్మక బుల్లెట్ ట్రైన్ డిపో ప్రాజెక్టును అక్కడే ఏర్పాటు చేయాలని భావిస్తున్న తెలంగాణ ప్రభుత్వం.. గతంలో వీరితో చాలా రకాలుగా చర్చలు జరిపింది. అయితే అవి తమ భూములు కావడంతోనే ప్రభుత్వం చర్చించింది అని వారు భావిస్తున్నారు. బేరసారాలకు దిగుతున్నారు. దీంతో ప్రభుత్వం సాఫ్ట్ కార్నర్ పక్కనపెట్టి హైడ్రా సాయంతో నేరుగా రంగంలోకి దిగింది. ఆ భూములను స్వాధీనం చేసుకుంటోంది.

ధరల పెరుగుదలతో…

Also Read:బాలున్ని తరగతి గదిలో ఉంచి తాళం వేసిన టీచర్… నిర్లక్ష్యానికి సస్పెన్షన్!

ప్రస్తుతం శంషాబాద్ చుట్టూ భూముల ధరలు అమాంతం పెరిగాయి. రీజనల్ రింగ్ రోడ్, బుల్లెట్ ట్రైన్ కనెక్టివిటీ వంటి మౌలిక వసతుల ప్రాజెక్టుల వల్ల అక్కడ భూముల ధరలు విపరీతంగా పెరిగాయి. ఈ క్రమంలో ప్రభుత్వ భూములు వదులుకునేందుకు ఆక్రమణదారులు సమ్మతించడం లేదు. అలాగని హక్కు పత్రాలు లేని ప్రభుత్వ భూములకు కోట్లాది రూపాయల పరిహారం ఇవ్వడం చట్టప్రకారం సాధ్యం కాదు కూడా. అందుకే అక్కడ హైడ్రా కఠిన చర్యలు ఆక్రమణదారులకు మింగుడు పడడం లేదు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు