Homeరాజకీయంసంతుసేవాల్ మ‌హారాజ్‌ చేసిన సేవ‌లు చిర‌స్మ‌ర‌ణ‌నీయం

సంతుసేవాల్ మ‌హారాజ్‌ చేసిన సేవ‌లు చిర‌స్మ‌ర‌ణ‌నీయం

  • స‌న‌త్ న‌గ‌ర్ ఎమ్మెల్యే త‌ల‌సాని శ్రీ‌నివాస్‌యాద‌వ్‌

హైద‌రాబాద్‌,క్రైమ్‌మిర్ర‌ర్: సంత్ సేవాల్ మ‌హారాజ్ మాన‌వాళిని స‌న్మార్గంలో న‌డిపించేందుకు ఆయ‌న‌చేసిన బోధ‌న‌లు చిర‌స్మ‌ర‌ణీయ‌మ‌ని స‌న‌త్‌న‌గ‌ర్ ఎమ్మేల్యే త‌ల‌సాని శ్రీ‌నివాస్‌యాద‌వ్ అన్నారు. సేవాలాల్ మ‌హారాజ్ జ‌యంతి సంద‌ర్భంగా ఎస్ఆర్‌న‌గ‌ర్‌లో బాపున‌గ‌ర్‌క‌మిటీ హాల్‌లో నిర్వ‌హించిన‌ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ముందుగా ఆయ‌న చిత్ర‌ప‌టానికిపూజ‌లు నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ సేవాలాల్ మ‌హారాజ్‌బోధించిన స‌త్యం, ధ‌ర్మం, అహింసా మార్గంల‌ను అనుస‌రించ‌డ‌మే ఆయ‌న‌కు ఇచ్చే నిజ‌మైన ఘ‌న నివాళులు అని ఆయ‌న అన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో బీఆర్ ఎస్ డివిజ‌న్ ప్ర‌ధాన‌కార్య‌ద‌ర్శి సంతోష్ మ‌ణికుమార్‌తో పాటు బీఆర్ ఎస్ నాకులు అశోక్‌యాద‌వ్‌, గోపిలాల్‌చౌహాన్‌,క‌ట్టా బ‌ల‌రాం, కూతురు న‌ర‌సింహా, శేఖ‌ర్‌ లుపాల్గొన్నారు.

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

తాజావార్తలు