Homeతెలంగాణతెలంగాణ స‌ర్కార్ రైతుల‌కు శుభ‌వార్త‌...! మూడో విడ‌త రైతు భ‌రోసా విడుద‌ల‌...

తెలంగాణ స‌ర్కార్ రైతుల‌కు శుభ‌వార్త‌…! మూడో విడ‌త రైతు భ‌రోసా విడుద‌ల‌…

హైద‌రాబాద్‌, క్రైమ్‌మిర్ర‌ర్: వ్య‌వ‌సాయ‌రంగానికి పెద్ద‌పీట వేస్తున్న ప్ర‌జా ప్ర‌భుత్వం మ‌రోసారి రైతుల‌కు శుభ‌వార్త తెలిపింది. రైతు భ‌ర‌సా ప‌థ‌కం కింద మూడో విడ‌త రైతు భ‌రోసా నిధుల‌ను విడుద‌ల చేసింది. మూడో విడుత‌లో 3 నుంచి 4 ఎకరాల భూమి కలిగిన రైతుల ఖాతాల్లో రూ.1,330 కోట్లను జమ చేసినట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. ఈ విడతలో 6.39 లక్షల మంది రైతులు లబ్ధి పొందగా, ఇప్పటివరకు మొత్తం 61.35 లక్షల మంది రైతులకు రూ.5,402.37 కోట్ల రైతు భరోసా సాయాన్ని ప్రభుత్వం అందించినట్లు మంత్రి తెలిపారు.

Also Read:తెలంగాణ పాలిటిక్స్‌లో ‘11 AM’ హైటెన్షన్.. ‘సై’ అంటే ‘సై’ అంటున్న కాంగ్రెస్ – బీఆర్ఎస్!!

ఈ సంద‌ర్భంగా మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర్‌రావు మాట్లాడుతూ వ్య‌వ‌సాయ రంగాన్ని బలోపేతం చేయడం, సాగు ఖర్చులను తగ్గించడం, రైతులకు ఆర్థిక భరోసా కల్పించడమే రైతు భరోసా పథకం ప్రధాన ఉద్దేశమని మంత్రి తుమ్మల పేర్కొన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోనే నిధులు జమ చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం రైతు సంక్షేమాన్ని అత్యంత ప్రాధాన్యంగా తీసుకుని ముందుకు సాగుతోందని మంత్రి తుమ్మల అన్నారు.

Also Read:బంగారం ధ‌ర‌లు మ‌రింత దిగువ‌కు…! ఈ రోజు ఎంతంటే…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు