Homeతెలంగాణహమాలీల సంఖ్య పెంచి అన్ లోడింగ్ చేయాలి... కలెక్టర్ గరిమ అగ్రవాల్...!

హమాలీల సంఖ్య పెంచి అన్ లోడింగ్ చేయాలి… కలెక్టర్ గరిమ అగ్రవాల్…!

రాజన్న సిరిసిల్ల, క్రైమ్‌మిర్ర‌ర్‌: హమాలీల సంఖ్యను పెంచి ధాన్యం కొనుగోళ్ళ ప్రక్రియ త్వరితగతిన పూర్తయ్యేలా పర్యవేక్షణ చేయాలని, ట్రాన్స్ పోర్ట్ కాంట్రాక్టర్లు వాహనాలు సరిపడా సమకూర్చేలా ఆదేశాలు జారీ చేయాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. జిల్లాలోని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సేకరణ,సేకరించిన ధాన్యం మిల్లులు,గోదాంలకు తరలించి అన్ లోడింగ్ వేగవంతం చేసి నిల్వ చేయడం, ఆన్ లైన్ ట్యాబ్ ఎంట్రీ పురోగతి, తదితర అంశాలపై అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, పౌర సరఫరాలు, సహకార శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖ, మెప్మా,రవాణా,తదితర శాఖల జిల్లా అధికారులతో కలెక్టర్ మంగళవారం ఉదయం టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.

లక్ష్యానికి అనుగుణంగా ధాన్యం సేకరణ, మిల్లులో అన్ లోడింగ్ పై కలెక్టర్ ఆరా తీశారు. మిల్లుల వారీగా ఎంతవరకు ధాన్యం అన్ లోడింగ్ చేశారో వివరాలు అడిగి,హమాలీల సంఖ్య పెంచుకునేలా యజమానులకు ఆదేశాలు జారీ చేయాలన్నారు. లక్ష్యానికి మేరకు రోజూ వారీగా కొనుగోళ్ళ శాతం క్రమంగా పెరిగేలా చూడాలని ఆదేశించారు.వర్షాలు పడే అవకాశం ఉన్న దృష్ట్యా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఉన్న బస్తాలను వెంటనే మిల్లులు, గోదాములకు తరలించేలా తక్షణ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. టార్పాలిన్స్ అందుబాటులో ఉండేలా చూడాలని అన్నారు. గన్నీ బ్యాగులు, కొనుగోలు కేంద్రాల్లో చేస్తున్న ట్యాబ్ ఎంట్రీ, తదితర వివరాలు ఆరా తీశారు.

కొనుగోళ్ళు పూర్తయిన కేంద్రాల నుండి హమాలీలను అపరెల్ పార్క్ కు పంపించి, అన్ లోడింగ్ వేగవంతం చేయడంపై దృష్టి సారించాలని, వాహనాలను ఇతర కేంద్రాలను తరలించాలని సూచించారు.రోజూ వారీగా కొనుగోళ్ళ శాతం పెంచి, సాధ్యమైనంత త్వరగా కొనుగోళ్ళు సజావుగా పూర్తయ్యేలా చూడాలని ఆదేశించారు.తూకం వేసి ఉన్న ధాన్యం బస్తాలను తరలించేందుకు ట్రాన్స్ పోర్ట్ కాంట్రాక్టర్లు సరిపడా వాహనాలు సమకూర్చేలా ఆదేశాలు జారీ చేయాలన్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు