Homeతెలంగాణకర్రెగుట్టల్లో తొలిసారి రెప‌రెప‌లాడిన జాతీయ జెండా...! 50 ఏళ్ల త‌రువాత ఆ కంచు కోట ఇక‌పై...!

కర్రెగుట్టల్లో తొలిసారి రెప‌రెప‌లాడిన జాతీయ జెండా…! 50 ఏళ్ల త‌రువాత ఆ కంచు కోట ఇక‌పై…!

హైదరాబాద్, క్రైమ్‌మిర్రర్‌: ఒకప్పుడు మావోయిస్టుల కంచుకోటగా పేరొందిన కర్రెగుట్టల్లో భారత త్రివర్ణ పతాకం రెపరెపలాడింది. తెలంగాణ–ఛత్తీస్‌గఢ్ సరిహద్దులోని కర్రెగుట్టల్లో తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ సోమవారం జాతీయ జెండాను ఆవిష్కరించారు. దాదాపు 50 ఏళ్ల తర్వాత తెలంగాణ వైపు ఈ ప్రాంతంలో అధికారికంగా త్రివర్ణ పతాకం ఎగరడం ఇదే తొలిసారి కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. స్వాతంత్ర్య దినోత్సవానికి ఐదు రోజుల ముందు జరిగిన ఈ కార్యక్రమం భద్రతా పరిస్థితుల్లో వచ్చిన గణనీయమైన మార్పుకు ప్రతీకగా నిలిచింది.కర్రెగుట్టలు గతంలో నిషేధిత సీపీఐ (మావోయిస్టు)కు కీలక స్థావరంగా ఉండేవి.

Also Read:విజయ్ సేతుపతి స్లమ్ డాగ్ సినిమాలో టాబు రోల్ ఇదే..!

దట్టమైన అటవీ ప్రాంతం, క్లిష్టమైన భౌగోళిక పరిస్థితులు, భారీగా మందుపాతరలు ఉండటంతో భద్రతా బలగాలు, ప్రభుత్వ అధికారులు కూడా ఈ ప్రాంతంలో స్వేచ్ఛగా సంచరించడం కష్టంగా ఉండేది. ప్రస్తుతం భద్రతా బలగాల ఆపరేషన్లతో పరిస్థితులు పూర్తిగా రిపోయాయని అధికారులు చెబుతున్నారు.డీజీపీ సీవీ ఆనంద్ మాట్లాడుతూ.. దాదాపు 50 ఏళ్లుగా మావోయిస్టులకు స్థావరంగా ఉన్న కర్రెగుట్టల్లో ఇప్పుడు పోలీసు, అటవీ శాఖ అధికారులు స్వేచ్ఛగా సంచరించే పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. తెలంగాణ పోలీసులు గ్రేహౌండ్స్, కోబ్రా తదితర బలగాలతో కలిసి వ్యూహాత్మకంగా చేపట్టిన ఆపరేషన్ల ఫలితంగా ఈ ప్రాంతంలో మావోయిస్టుల ప్రభావం గణనీయంగా తగ్గిందన్నారు. ఆపరేషన్‌ సందర్భంగా దాదాపు 700 మంది మావోయిస్టులు లొంగిపోయినట్లు కూడా ఆయన వెల్లడించారు.

Also Read:తెలంగాణ కేబినెట్ విస్తరణకు హైకమాండ్ గ్రీన్ సిగ్నల్…!

650 అడుగుల ఎత్తులో జాతీయ జెండా…

కర్రెగుట్టల్లో సుమారు 650 అడుగుల ఎత్తులో డీజీపీ సీవీ ఆనంద్ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం శాంతికి ప్రతీకగా పావురాలను ఎగురవేశారు. ఈ కార్యక్రమం ద్వారా గతంలో భద్రతా పరంగా అత్యంత సున్నితమైన ప్రాంతంగా ఉన్న కర్రెగుట్టల్లో ఇప్పుడు ప్రభుత్వ యంత్రాంగం తిరిగి తన ఉనికిని చాటుకుంటోందనే సందేశం వెళ్లింది.

గిరిజన కుటుంబాలకు నిత్యావసర సరుకులు…

Also Read:ప్రభాస్‌పై టాలీవుడ్ నటుడి ఆసక్తికర వ్యాఖ్యలు.. ఆయన నా దేవుడు.. మా బంధం మాటల్లో చెప్పలేను!

డీజీపీ పర్యటనలో భాగంగా కర్రెగుట్టల పరిసరాల్లోని గిరిజన ప్రాంతాల్లోనూ పలు కార్యక్రమాలు నిర్వహించారు. పామునూరు ప్రాంతంలో ఏడు గిరిజన కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ఇతర సహాయాన్ని పొందేందుకు పోలీసు, రెవెన్యూ అధికారులను సంప్రదించాలని వారికి సూచించారు.

మావోయిస్టు ప్రభావం నుంచి అభివృద్ధి వైపు..

Also Read:విశాఖలో AAA సినిమాస్.. కొత్త ఎయిర్‌పోర్ట్‌పై బన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు!

కర్రెగుట్టల్లో త్రివర్ణ పతాకం ఎగరడం కేవలం ఒక కార్యక్రమంగా కాకుండా.. గతంలో మావోయిస్టుల ప్రభావంతో అట్టుడికిన ప్రాంతం ఇప్పుడు శాంతి, భద్రత, అభివృద్ధి వైపు అడుగులు వేస్తోందనే సంకేతంగా అధికారులు భావిస్తున్నారు. రహదారులు, కనెక్టివిటీ, ప్రభుత్వ సేవలు, గిరిజన సంక్షేమం, పర్యాటక అవకాశాలపై భవిష్యత్తులో మరింత దృష్టి పెట్టే అవకాశం ఉంది.దశాబ్దాలుగా భద్రతా పరంగా సవాలుగా ఉన్న కర్రెగుట్టల్లో డీజీపీ చేతుల మీదుగా త్రివర్ణ పతాకం ఎగరడం.. తెలంగాణలో మావోయిస్టు ప్రభావం తగ్గుతున్నదానికి, ప్రభుత్వ యంత్రాంగం మారుమూల ప్రాంతాలకు చేరువవుతున్నదానికి ప్రతీకగా నిలిచింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు