Homeఆంధ్ర ప్రదేశ్కూట‌మి ప్ర‌భుత్వానికి ఇంట‌ర్వెల్ పూర్త‌యింది...! అమర్ నాథ్ వ్యాఖ్యలు వైర‌ల్‌...

కూట‌మి ప్ర‌భుత్వానికి ఇంట‌ర్వెల్ పూర్త‌యింది…! అమర్ నాథ్ వ్యాఖ్యలు వైర‌ల్‌…

హైద‌రాబాద్‌, క్రైమ్‌మిర్ర‌ర్‌: ఏపీలో కొద్ది రోజులుగా కాపు సామాజిక వర్గం కేంద్రంగా రాజకీయం వేడెక్కింది. కాపు కేంద్ర బిందువుగా సాగుతున్న ఈ రాజకీయంలో వైసిపి వర్సెస్ జనసేన అన్నట్టుగా ఇరు పార్టీలకు చెందిన నేతలు మాటల తూటాలతో చెలరేగిపోతున్నారు. వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డిని లక్ష్యంగా చేసుకొని జనసేనకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తుంటే.. అంతే స్థాయిలో వైసీపీకి చెందిన మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు పవన్ కళ్యాణ్ పై విరుచుకుపడుతున్నారు. ఈ నేపద్యంలోనే మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.

Also Read:పారిశ్రామికవేత్త కేతన్ హత్య కేసులో కీల‌క ప‌రిణామం…!త‌ప్పు చేస్తే ఉరితీయాల‌న్న త‌ల్లి…

అమర్ వ్యాఖ్యలతో రానున్న రోజుల్లో వైసీపీ మరింత జోరు పెంచుతుందా అన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. తాజాగా మీడియాతో మాట్లాడిన అమర్.. కూటమి ప్రభుత్వ పాలనకు ఇంటర్వెల్ పూర్తయిందని, రానున్నది క్లైమాక్స్ అని పేర్కొన్నారు. ఇంటర్వెల్ కార్డు ప్రభుత్వానికి పడిపోయిందని, ఇక సెకండాఫ్ దద్దరిల్లిపోతుందని అమర్ వ్యాఖ్యానించారు. మాజీ మంత్రి అమర్ చేసిన ఈ వ్యాఖ్యలను సాధారణంగా తీసుకోవాల్సిన పనిలేదని నిపుణులు పేర్కొంటున్నారు. గడచిన కొద్ది రోజులుగా వైసీపీ నేతల స్పీడు చూస్తుంటే మరి కొద్ది రోజుల్లోనే ఎలక్షన్లు ఉన్నాయా అన్నట్టుగా ఉంది. ఇదే స్పీడును మిగిలిన రెండేళ్లు కొనసాగించాలన్న వ్యూహంతో వైసిపి ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే తమ భవిష్యత్తు ప్రణాళిక దృష్టిలో పెట్టుకొని అమర్నాథ్ తాజా వ్యాఖ్యలు చేసినట్లు చెబుతున్నారు.

స్పీడ్ పెంచిన వైసీపీ నేతలు.. ఇకపై ప్రజల్లోనే…

Also Read:ఇలాంటి ద‌ర్శ‌కుడిని ఎప్పుడు చూడ‌లేదు…!ఒక్క షాట్ కోసం 94 టేకులు…

కూటమి ప్రభుత్వ పాలనపై ప్రజల్లో వ్యతిరేకత మొదలైందని వైసిపి భావిస్తోంది. ఇప్పటికే ఇచ్చిన అనేక హామీలను అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందన్న భావనను ఆ పార్టీ నాయకులు వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయాన్ని మరింత పకడ్బందీగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్న ఉద్దేశంతో వైసిపి ముఖ్య నాయకులు ఉన్నారు. ఆ పార్టీ అధినేత జగన్ కూడా ఇదే విషయాన్ని నాయకులకు తెలియజేశారు. రానున్న రెండేళ్లు ప్రజల్లోనే ఉంటూ ప్రజా మద్దతు పొందాలని సూచించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేలా తీవ్రస్థాయిలో పోరాటం చేయాలని సూచించారు.

Also Read:అమెజాన్ నుంచి రోడ్డు పైకీ రోబో టాక్సీ…! డ్రైవ‌ర్ లేకుండానే…

అందులో భాగంగానే కొన్నాళ్లుగా సైలెంట్ గా ఉన్న ఎంతోమంది నాయకులు ఇప్పుడిప్పుడే బయటికి వచ్చి తమ వాయిస్ వినిపిస్తున్నారు. రానున్న రోజుల్లో ఇది మరింత తీవ్రమవుతుందని ఆ పార్టీ ముఖ్య నాయకులు పేర్కొంటున్నారు. కొద్దిరోజులు కిందటి వరకు కూటమి పార్టీ పెట్టే కేసులకు భయపడి చాలామంది నాయకులు సైలెంట్ గా ఉన్నారు. అటువంటి నాయకులు కూడా ఇప్పుడు బహిరంగంగానే ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేస్తున్నారు. ఒకరకంగా చెప్పాలంటే వైసిపి నాయకులు అరెస్టులకు కూడా భయపడడం లేదు. జైలుకు వెళ్లడానికి కూడా సిద్ధంగానే తమ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారంటూ గతంలో అంబటి రాంబాబు, పేర్ని నాని వంటి నేతలు వ్యాఖ్యానించారు.

Also Read:ఉచిత దర్శనాలపై టీటీడీ కీలక ప్రకటన…! ప్రతిరోజు వేయి మందికి అవకాశం…

ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వ విధానాలపై మరింత బలంగా వాయిస్ వినిపించే అవకాశం వైసిపి నేతలు నుంచి ఇకపై ఉంటుందని చెబుతున్నారు. ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై పోరాటం కూడా గట్టిగానే ఉండే అవకాశం ఉందని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. తాజాగా అమర్చేసిన వ్యాఖ్యలు వైసిపి వ్యూహాత్మక ఎత్తుగడగానే భావిస్తున్నారు. బొమ్మ దద్దరిల్లిపోవడం అంటే.. ఇకపై ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించడమే లక్ష్యంగా వైసీపీ నేతలు అడుగులు వేస్తారని చెబుతున్నారు. మరి సెకండ్ హాఫ్ దద్దరిల్లిపోయేలా వైసిపి వేసే అడుగులు ఎలా ఉంటాయో అన్నది భవిష్యత్తులో తేలుతుంది.

Also Read:గ్యాస్ వినియోగదారులకు భారీ ఊరట…! ఆంక్షలు ఎత్తివేసిన కేంద్రం…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు