బీడీ పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికుల కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం మరోసారి శుభవార్త అందించింది. పిల్లల విద్యను ప్రోత్సహించేందుకు కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వశాఖ 2026-27 విద్యాసంవత్సరానికి ప్రత్యేక స్కాలర్‌షిప్ పథకాన్ని ప్రకటించింది. పాఠశాల స్థాయి నుంచి ప్రొఫెషనల్ కోర్సుల వరకు చదువుతున్న విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించనుంది.
ఈ పథకం కింద 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న వారికి ప్రీ-మెట్రిక్ స్కాలర్‌షిప్ ఇవ్వబడుతుంది. అలాగే ఇంటర్మీడియట్, డిగ్రీ, ఐటీఐ, ఇతర ప్రొఫెషనల్ కోర్సులు చేస్తున్న వారికి పోస్టు-మెట్రిక్ స్కాలర్‌షిప్ వర్తిస్తుంది. ముఖ్యంగా 10వ తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల్లో మొదటి ప్రయత్నంలోనే ఉత్తీర్ణులైన విద్యార్థులు మాత్రమే ఈ పథకానికి అర్హులు.
స్కాలర్‌షిప్ మొత్తాలు తరగతుల వారీగా ఇలా ఉన్నాయి:
1వ నుంచి 4వ తరగతి వరకు రూ.1,000, 5వ నుంచి 8వ తరగతి వరకు రూ.1,500, 9వ మరియు 10వ తరగతులకు రూ.2,000 అందిస్తారు. ఇంటర్మీడియట్ చదువుతున్న వారికి రూ.3,000, డిగ్రీ, ఐటీఐ, ఇతర కోర్సులకు రూ.6,000 సహాయం లభిస్తుంది. ఇక బీటెక్, బీఏఎంఎస్ వంటి ఉన్నత ప్రొఫెషనల్ కోర్సులు చేస్తున్న వారికి గరిష్టంగా రూ.25,000 వరకు ఆర్థిక సాయం అందించనున్నారు.
దరఖాస్తుల విషయానికి వస్తే, ప్రీ-మెట్రిక్ విద్యార్థులు ఆగస్టు 31లోపు అప్లై చేయాలి. పోస్టు-మెట్రిక్ విద్యార్థులకు అక్టోబర్ 31 చివరి తేదీగా నిర్ణయించారు. ఆసక్తి గల విద్యార్థులు scholarships.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
also read: దేశీయ వ్యవసాయ ఉత్పత్తులో కీలక మైలురాయి…! సింగాపూర్‌కు బంగినపల్లి మామిడి పండ్లు…