సులభంగా ఎక్కువ డబ్బు సంపాదించాలనే ఆశను ఆసరాగా చేసుకుని మోసాలకు పాల్పడే ఘటనలు తరచూ వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. తాజాగా కర్నూలు జిల్లాలో జరిగిన ఓ ఘటన మాత్రం సినిమా కథను తలపించేలా ఉండటంతో స్థానికంగా సంచలనంగా మారింది. నల్ల రంగు పూసిన నోట్లను ప్రత్యేక రసాయనంతో అసలైన కరెన్సీగా మార్చేస్తామని నమ్మబలికి ఓ వ్యక్తి యువకుడిని మోసం చేసిన ఘటన ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఈ వ్యవహారంపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
పోలీసుల వివరాల ప్రకారం.. కర్నూలు జిల్లా క్రిష్ణగిరి మండలం ఆగవేలి గ్రామానికి చెందిన వీరేష్‌కు సి.బెళగల్ మండలం బాతోలికి చెందిన వెంకటేశ్వర్లు పరిచయం అయ్యాడు. తన వద్ద భారీ మొత్తంలో నల్లధనం ఉందని, పన్నుల నుంచి తప్పించుకోవడానికి ఆ నోట్లపై నల్ల రంగు పూశామని అతడు చెప్పినట్లు సమాచారం. ఆ నోట్లను ప్రత్యేక రసాయనం సహాయంతో మళ్లీ సాధారణ నోట్లుగా మార్చవచ్చని చెబుతూ, తక్కువ పెట్టుబడితో ఎక్కువ డబ్బు సంపాదించే అవకాశం ఉందంటూ ఆశ చూపినట్లు పోలీసులు తెలిపారు.
మొదట వీరేష్ అనుమానపడినా, నిందితుడు తన ప్రణాళికలో భాగంగా కొన్ని నల్లటి కాగితాలను తీసుకుని వాటిని ఒక ద్రవంలో ముంచి చూపించినట్లు సమాచారం. కొద్దిసేపటికి అవి అసలైన రూ.500 నోట్లుగా కనిపించడంతో బాధితుడు నమ్మకం పెంచుకున్నాడు. దీంతో లక్ష రూపాయల నగదును వెంకటేశ్వర్లుకు ఇచ్చినట్లు వెల్లడించారు. అనంతరం నిందితుడు కొన్ని నల్లటి కట్టలు, ఒక రసాయన సీసా ఇచ్చి ఇంటికి వెళ్లి స్వయంగా ప్రయత్నించమని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
ఇంటికి వెళ్లిన తర్వాత బాధితుడు ఆ కట్టలను తెరిచి రసాయనంతో ప్రయత్నించగా అసలు విషయం బయటపడింది. పైభాగం, కింద భాగంలో మాత్రమే కొద్దిపాటి అసలైన నోట్లు ఉంచి, మధ్యలో నల్ల రంగు పూసిన సాధారణ కాగితాలు పెట్టినట్లు గుర్తించాడు. దీంతో తాను మోసపోయానని తెలుసుకున్న వీరేష్ వెంటనే పోలీసులను ఆశ్రయించాడు.
ఫిర్యాదు అందుకున్న క్రిష్ణగిరి పోలీసులు దర్యాప్తు చేపట్టి చెరుకులపాడు రోడ్డులోని ఓ రైస్ మిల్లు వద్ద నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద నుంచి రూ.2 లక్షల నగదు, నల్లటి కాగితాల కట్టలను స్వాధీనం చేసుకున్నారు. విచారణలో నిందితుడు గతంలో ప్రైవేట్ ఉద్యోగం చేసినట్లు, సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో ఈ తరహా మోసాలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. అనంతరం నిందితుడిని డోన్ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు.
ఈ ఘటన నేపథ్యంలో పోలీసులు ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు వస్తుందని చెప్పే పథకాలు, రహస్య లావాదేవీలు, అక్రమ ఆర్థిక హామీల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సులభంగా సంపాదించాలనే ఆశతో నిర్ణయాలు తీసుకుంటే ఆర్థిక నష్టాలతో పాటు చట్టపరమైన ఇబ్బందులు కూడా ఎదురయ్యే అవకాశం ఉందని హెచ్చరించారు.

ALSO READ: జీవితంలో ఒక్కసారైనా ఈ జర్నీ చేయాల్సిందే..!