Homeతెలంగాణఎయిర్ పోర్ట్ ఎఫెక్ట్...! ఆ 30 గ్రామాలకు కనెక్టివిటీ కట్...

ఎయిర్ పోర్ట్ ఎఫెక్ట్…! ఆ 30 గ్రామాలకు కనెక్టివిటీ కట్…

అదిలాబాద్, క్రైమ్‌మిర్ర‌ర్‌: ఆదిలాబాద్‌లో ప్రతిపాదిత ఎయిర్‌పోర్టు నిర్మాణం కోసం భూసేకరణలో అనుకుంట ప్రధాన రహదారి కూడా చేరనుండటంతో 30 గ్రామాలకు కనెక్టివిటీ లేకుండా పోతుంది. దీంతో ప్రత్యామ్నాయంగా కచికంటి మీదుగా కొత్త బైపాస్ నిర్మించనున్నారు. 66 అడుగుల వెడల్పుతో రూపొందనున్న ఈ రహదారి కోసం ప్రభుత్వం రూ.35 కోట్లు కేటాయించింది. బంగారుగూడ, కచికంటి మీదుగా జిల్లా కేంద్రానికి సులభంగా చేరుకునేలా ఈ మార్గాన్ని అభివృద్ధి చేయనున్నారు. విమానాశ్రయ నిర్మాణం కారణంగా రాకపోకలకు అంతరాయం కలగకుండా చర్యలు చేపడుతున్నారు.ఆదిలాబాద్‌లో ప్రతిపాదిత విమానాశ్రయ నిర్మాణంతో జిల్లాలో రహదారి వ్యవస్థలో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. విమానాశ్రయం కోసం చేపట్టనున్న భూసేకరణలో ప్రస్తుతం వేలాది మంది వినియోగిస్తున్న అనుకుంట ప్రధాన రహదారి కూడా చేరనుండటంతో అధికారులు ప్రత్యామ్నాయ మార్గం ఏర్పాటుపై దృష్టి సారించారు. దాదాపు 30 గ్రామాల ప్రజల రాకపోకలకు అంతరాయం కలగకుండా కొత్త బైపాస్ రహదారిని నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

Also Read:ఎపిక్ రిలీజ్ డేట్ అనౌన్స్.. సెప్టెంబర్‌లో థియేటర్లలో గ్రాండ్ ఎంట్రీ…!

ప్రస్తుతం ఆదిలాబాద్ పట్టణం నుంచి ఆదిలాబాద్ గ్రామీణ మండలంలోని కచికంటి గ్రామానికి వెళ్లేందుకు శ్రీరాంకాలనీ, కుమ్మరివాడ, విమానాశ్రయ స్థలానికి ఆనుకుని ఉన్న ప్రాంతం, ఇందిరమ్మ కాలనీ మీదుగా ప్రయాణిస్తున్నారు. విమానాశ్రయ నిర్మాణంతో ఈ మార్గం మూసివేయబడే అవకాశం ఉండటంతో కచికంటి నుంచి బంగారుగూడ ప్రధాన రహదారిని అనుసంధానించే కొత్త రహదారిని నిర్మించాలని అధికారులు నిర్ణయించారు. ఇందుకోసం కచికంటి గ్రామ సమీపంలో కొత్త బైపాస్ నిర్మించి, అక్కడ అవసరమైన భూసేకరణ చేపట్టనున్నారుకొత్త రహదారిని 66 అడుగుల వెడల్పుతో అభివృద్ధి చేయనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఈ మార్గం ద్వారా బంగారుగూడ, కచికంటి మీదుగా ఆదిలాబాద్ పట్టణానికి సులభంగా చేరుకునే అవకాశం కలుగుతుంది. దీంతో విమానాశ్రయ నిర్మాణం వల్ల కలిగే రవాణా ఇబ్బందులు తగ్గడంతో పాటు భవిష్యత్ ట్రాఫిక్ అవసరాలను కూడా దృష్టిలో పెట్టుకుని ఈ రహదారిని రూపొందిస్తున్నారు. ఆదిలాబాద్ మండలంలోని యాపల్‌గూడ, రాముల్‌గూడ, కొత్తగూడ, యశ్వంత్‌గూడ, మత్తడిగూడ, బూర్నూర్, అడ్డగుట్ట, శివఘాట్, కుంభఝరి, టాక్లీ గ్రామాలతో పాటు సాత్నాల మండలంలోని రామాయి, జాముల్‌ధరి, న్యూరాంపూర్, సాత్నాల, సుందరగిరి, మాంగూర్ల, కాన్పమేడిగూడ, మేడిగూడ, జామ్ని, మారుగూడ, తోయగూడ, సైద్‌పూర్, సహేజ్, సాంగ్వి, జామ్డ గ్రామాల ప్రజలు నిత్యం ఈ దారినే వినియోగిస్తున్నారు.

Also Read:త్రిష చుట్టూ తమిళ రాజకీయం!

అదేవిధంగా గాదిగూడ మండలంలోని పరస్వాడ, లోకారి, గాదిగూడ గ్రామాల ప్రజలు కూడా జిల్లా కేంద్రానికి చేరుకోవడానికి ఈ మార్గంపైనే ఆధారపడుతున్నారు.ఇవే కాకుండా ఆదిలాబాద్ అర్బన్ పరిధిలోని బంగారుగూడ, అనుకుంట గ్రామాల ప్రజలకు కూడా ఇదే ప్రధాన రహదారి. నార్నూర్, గాదిగూడ మండలాల్లోని మరికొన్ని గ్రామాల వాసులు కూడా ఆదిలాబాద్‌కు రావడానికి ఈ దారినే ఎక్కువగా ఉపయోగిస్తుండటంతో రోజూ ఆటోలు, ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు వాహనాలు, ద్విచక్ర వాహనాలతో ఈ మార్గం రద్దీగా ఉంటుంది. విమానాశ్రయ నిర్మాణంలో భాగంగా అనుకుంట ప్రాంతం చుట్టూ ఉన్న వ్యవసాయ భూములను ప్రభుత్వం సేకరించనుంది. దీంతో ఖానాపూర్ సమీపంలోని అనుకుంట మలుపు నుంచి అనుకుంట గ్రామం వరకు ఉన్న ప్రస్తుత రహదారి విమానాశ్రయ పరిధిలోకి వెళ్లనుంది. ఈ నేపథ్యంలో ప్రజలకు ప్రత్యామ్నాయ రాకపోకలు కల్పించేందుకు కొత్త రహదారి నిర్మాణాన్ని ప్రభుత్వం ప్రాధాన్యంగా తీసుకుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు