Homeఆంధ్ర ప్రదేశ్చ‌రిత్ర‌లో ఆ రోజు బ్లాక్ డే...సీఎం చంద్ర‌బాబు....!

చ‌రిత్ర‌లో ఆ రోజు బ్లాక్ డే…సీఎం చంద్ర‌బాబు….!

నిడదవోలు,క్రైమ్ మిర్ర‌ర్: మహిళా రిజర్వేషన్ బిల్లు అడ్డుకున్న విపక్షాల వైఖరికి నిరసనగా నిడదవోలులో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు భారీ ర్యాలీ నిర్వ‌హించారు. ఈ ర్యాలీ సీఎం చంద్ర‌బాబు నాయుడు ముఖ్య అతిథి పాల్గొని మాట్లాడారు. పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకోవటం ద్వారా జాతికి ద్రోహం జరిగిందన్నారు. కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని ప్రతిపక్ష పార్టీలు మహిళలకు అన్యాయం చేశాయి. భారతదేశ ప్రజాస్వామ్య చరిత్రలో నిన్నటి రోజు ఓ బ్లాక్ డే. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు వస్తాయని, సుదీర్ఘ కల సాకారం అవుతుందని అందరం భావించాం.

పార్లమెంట్, అసెంబ్లీలోనూ 33 శాతం మంది మహిళల్ని ప్రజాప్రతినిధులుగా చూస్తామని అనుకున్నాం. మహిళల్ని గౌరవించటం భారత సంస్కృతిలో భాగం. ఎక్కడ స్త్రీలను పూజిస్తారో అక్కడ దేవతలుంటారని మన నానుడి. నిన్న పార్లమెంటులో దానికి భిన్నంగా జరిగింద‌న్నారు. అందుకు నిరసనగా నిడుదవోలులో ఎన్డీఏ పక్షాలు నిరసన ర్యాలీ చేపట్టామ‌ని పేర్కొన్నారు. మహిళలంతా బయటకు వచ్చి నిరసన తెలిజేయాలని పిలుపు నిచ్చారు.

దక్షిణాదికి, చిన్న రాష్ట్రాలకు అన్యాయం జరగదని ప్రధాని, హోంమంత్రి హామీ ఇచ్చారు. 50 శాతం మేర సీట్లు పెరుగుతాయని స్పష్టంగా చెప్పారు. ఏపీలో కూడా 50 శాతం మేర సీట్లు పెరుగేవి. కానీ ప్రతిపక్ష పార్టీలు తమ రాజకీయ అజెండా కోసం ఈ దుర్మార్గం చేశాయ‌ని మండిప‌డ్డారు.. దశాబ్దాలుగా మహిళా రిజర్వేషన్ కోసం పోరాడుతున్నాం. దీనిని అడ్డుకోవటం క్షమించరాని నేరమ‌న్నారు. ఆడబిడ్డలంటే కాంగ్రెస్ నేతృత్వంలోని విపక్షాలకు ఇంత చులకనా? నిన్న జరిగిన విద్రోహాన్ని ప్రతీ ఇంటికీ తీసుకెళ్తాం. ఇవాళ చేపట్టిన నిరసన ఆరంభం మాత్రమనని అన్నారు.

ఇత‌ర పార్టీలు క‌లిసి రావాలి…

మ‌హిళా రిజ‌ర్వేష‌న్ బిల్లుపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తో మాట్లాడారు. ఎన్డీఏ పక్షాలతో పాటు ఇతర పార్టీలు కూడా కలిసి రావాలి. మహిళలను ఓటు అడిగే పార్టీలు మహిళా సాధికారతను అడ్డుకుంటాయా? 2017లో టీడీపీ అధికారంలో ఉండగా అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించాం. కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు బిల్లు కూడా తీసుకు రాలేకపోయారు. 2023లో బిల్లు ప్రవేశపెట్టినా దీనిని అమలు చేసే నిబంధన పెట్టారు.

2029లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలన్న ఉద్దేశంతోనే సవరణ బిల్లు తీసుకువచ్చార‌ని తెలిపారు.కావాలనే కాంగ్రెస్ నేతృత్వంలోని పార్టీలన్నీ ఈ బిల్లుకు 2/3 మంది సభ్యుల మద్దతు రాకుండా అడ్డుకున్నాయ‌న్నారు. దక్షిణాదికి, ఉత్తరాది రాష్ట్రాలకు ఆన్యాయం జరుగుతుందని ఏవేవో ఆరోపణలు చేసి సాకులు చెప్పారు. మహిళలకు ద్రోహం చేయటం సరికాదు. జనాభాలో 50 శాతంగా ఉన్న మహిళలు ఏ రంగంలో అయినా సమర్ధవంతంగా పనిచేస్తున్నారు.

అలాంటి మహిళలు చట్ట సభలకు వస్తే న్యాయం జరుగుతుందనే ఈ సవరణ బిల్లు వచ్చింది. మహిళల ఆత్మాభిమానం దెబ్బతీసే విధంగా బిల్లును అడ్డుకున్నారన్నారు. ఆ పార్టీలు చేసిన ద్రోహానికి డిపాజిట్ కూడా రాకుండా చేయాలి. ఆడబిడ్డలు పైకి వస్తే చూడలేకే ఈ బిల్లును అడ్డుకున్నారు. ఈ వ్యవహారంపై ప్రతీ ఒక్కరిని చైతన్యం చేసేలా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపడతామని అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు