Homeతెలంగాణతెలంగాణలో ఆడియో లీక్ కలకలం.. అంతర్గత వ్యవహారాలపై మాజీ మంత్రి షబ్బీర్ అలీ సంచలన కామెంట్స్

తెలంగాణలో ఆడియో లీక్ కలకలం.. అంతర్గత వ్యవహారాలపై మాజీ మంత్రి షబ్బీర్ అలీ సంచలన కామెంట్స్

  • పార్టీ పదవులు అమ్ముకుంటున్నారంటూ తీవ్ర వ్యాఖ్యలు
  • టిపిసిసి చీఫ్ చుట్టూ వివాదాలు

క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో : తెలంగాణ కాంగ్రెస్ లో అంతర్గత విభేదాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. నేతల మధ్య విభేదాల పర్వం గట్టిగానే నడుస్తోంది. మధ్యప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల్లో తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ నామినేషన్ సాంకేతిక కారణాలతో తిరస్కరణకు గురైంది. ఆమెకు కోర్టులో సైతం షాప్ తగిలింది. అయితే ఈ వివాదం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని తీవ్ర ఆత్మరక్షణలో పడేసింది. ఈ వివాదం మరువక ముందే మాజీ మంత్రి షబ్బీర్ అలీ ఆడియో సంభాషణ సోషల్ మీడియాలో లీక్ అయింది. పెను దుమారానికి దారితీసింది.

తీవ్ర ఆవేదనలో షబ్బీర్ అలీ..

కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కామారెడ్డి నియోజకవర్గంలో జరిగిన పరిణామాలపై తీవ్ర ఆవేదనతో ఉన్నారు షబ్బీర్ అలీ. ఈ వీడియో క్లిప్ లో షబ్బీర్ అలీ పార్టీ అంతర్గత వ్యవహారాలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుత తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ గా వ్యవహరిస్తున్న మహేష్ కుమార్ గౌడ్ తీరును తప్పుపడుతూ.. పార్టీలో పదవులు అమ్ముకుంటున్నారని.. ఇతర ప్రయోజనాలు డిమాండ్ చేస్తున్నారని చేసిన వ్యాఖ్యలు ఆడియోలో స్పష్టంగా వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు డబ్బులు ఇస్తే కొనుక్కోగలిగే పార్టీగా మారిపోయిందని షబ్బీర్ అలీ వ్యాఖ్యానించడం పార్టీ శ్రేణులను సైతం దిగ్భ్రాంతికి గురిచేసింది. మీనాక్షి నటరాజన్ వివాదం నడుస్తున్న తరుణంలోనే.. ఈ పాత ఆడియో క్లిప్ ఇప్పుడు లీక్ కావడం వెనుక కాంగ్రెస్ పార్టీలో ఒక వర్గం హస్తం ఉందని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. టిపిసిసి అధ్యక్షుడు పీఠంపై కన్నేసిన కొందరు సొంత పార్టీ నేతలు అధిష్టానం వద్ద ఆయన గ్రాఫ్ ను తగ్గించేందుకు ఈ లీక్ డ్రామాకు తెర లేపారని చర్చ జోరుగా సాగుతోంది.

వివాదం ప్రారంభం ఇలా..

కామారెడ్డి నియోజకవర్గ నుంచి రేవంత్ రెడ్డి బరిలో దిగిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో అక్కడ రేవంత్ సోదరుడు ఎన్నికల ఏజెంట్ గా నిలిచారు. అయితే అక్కడ షబ్బీర్ అలీ ద్వారా కాంగ్రెస్ పార్టీలో చేరిన నేత.. సీఎం వర్గానికి దగ్గరయ్యారు. కొద్ది రోజులకే షబ్బీర్ అలీని వ్యతిరేకించారు. అప్పటినుంచి అక్కడ వివాదం నడుస్తోంది. మరోవైపు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన షబ్బీర్ అలీకి ప్రాధాన్యం లేకుండా పోయింది. అందుకే ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. తన మనసులో ఉన్న ఆవేదనను మరో కార్యకర్తలతో ఫోన్లో పంచుకున్నారు. ఇప్పుడు అదే లీక్ కావడంతో తెలంగాణ కాంగ్రెస్ లో కల్లోలం రేపుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు