అంతర్జాతీయం

మొదటి టెస్టులో ఘోరంగా పరాజయం పొందిన టీం ఇండియా..?

బెంగళూరు వేదికగా భారతదేశం మరియు న్యూజిలాండ్ టెస్ట్ సిరీస్ జరిగిన విషయం అందరికీ తెలిసింది. అయితే ఇవాళ ఐదవ రోజు 107 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ కేవలం రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అనేది ఛేదించింది. దీంతో టీమ్ ఇండియా పై న్యూజిలాండ్ ఫస్ట్ టెస్ట్ అనేది సునాయాసంగా గెలిచింది. దీంతో భారత గడ్డపై న్యూజిలాండ్ మొదటి టెస్ట్ గెలవడంతొ సంబరాలు చేసుకుంటున్నాయి.

మొదటి రోజు బెంగళూరులో తుఫాన్ కారణంగా భారీ వర్షాలు పడి ఆట నిలిచిపోయిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇక మళ్ళీ మరుసటి రోజు ప్రారంభించిన టీమిండియా మొదటి ఇన్నింగ్స్ లో కేవలం 46 పరుగులకు ఆల్ అవుట్ అయ్యి కొత్త రికార్డు అనేది సృష్టించుకుంది. ఇక అనంతరం బ్యాటింగ్ దిగిన న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ లో 402 పరుగులు చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఇక భారత్ రెండవ ఇన్నింగ్స్ లో 462 పరుగులు చేసింది. ఇక అనంతరం 107 పరుగుల లక్ష్యముతో న్యూజీలాండ్ టీం కేవలం రెండు వికెట్లు కోల్పోయి చాలా సునాయసంగా గెలిచింది. దీంతో టీం ఇండియా అనేది మొదటి టెస్ట్ ఓడిపోయింది.

Read More : ఇండియా ఘోర విఫలం… కేవలం 46 పరుగులకే ఆల్ అవుట్

ఈ టెస్ట్ లో న్యూజిలాండ్ ప్లేయర్స్ అందరూ కూడా చాలా బాగా రానిచ్చారు. ఇక ఇండియా తరుపున కేఎల్ రాహుల్,అశ్విన్,జడేజా పూర్తిగా విఫలమయ్యారు. దీంతో మొదటి టెస్ట్ ఓడిపోవడంతొ ఇండియా అభిమానులు అందరూ కూడా తీవ్ర నిరాశకు గురయ్యారు. రెండో టెస్టులోనైనా టీమిండియా గెలుపొంది ఫ్యాన్స్ కి మంచి ఎంటర్టైన్మెంట్ అందించాలని అందరూ సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు. మరి కొంతమంది టెస్ట్ ఓడిపోయిన సరే సిరీస్ మనకే దక్కుతుందని అభిమానులు తెగ కామెంట్స్ చేస్తున్నారు.

 

Back to top button