భారతదేశం వర్సెస్ న్యూజిలాండ్ బెంగళూరు వేదికగా క్రికెట్ టెస్ట్ మ్యాచ్ జరుగుతున్న విషయం అందరికి తెలిసిందే. మొదటిరోజు వానదేవుడు కారణంగా భారీ వర్షాలు కురవడం వల్ల మ్యాచ్ అనేది రద్దు అయింది. అయితే మరుసటి రోజు వాన తగ్గగా గురువారం అనేది టెస్ట్ సిరీస్ పారంభించారు.
మొదటగా టాస్ గెలిచిన ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ ఎంచుకొని రంగంలోకి దిగారు. అయితే ఎవరూ ఊహించినటువంటి పరిణామాలు ఈ టెస్ట్ లో చోటు చేసుకున్నయి. రిషబ్ పంత్ మరియు జైస్వాల్ తప్ప ఎవరు కూడా సింగల్ డిజిట్ దాటలేదు. దీంతో కేవలం 46 పరుగులకే ఇండియా ఆల్ అవుట్ అయింది. ఈ మ్యాచ్లో ఐదుగురు డక్కోట్లు కావడం మరీ విచిత్రం. విరాట్ కోహ్లీ, సర్ఫ్ రాజ్ ఖాన్, కేఎల్ రాహుల్, జడేజా, అశ్విన్ డక్ అవుట్ అవ్వడంతో తక్కువ పరుగులకే టీమిండియా ఆల్ అవుట్ అవ్వాల్సి వచ్చింది. ఇక న్యూజిలాండ్ బౌలర్లు విరుచుకు పడడంతో ఇండియా ఘోరంగా మొదటి రోజు విఫలమయింది.