Homeతెలంగాణఅసెంబ్లీలో పాము కలకలం..భయాందోళనలకు గురైన జర్నలిస్టులు

అసెంబ్లీలో పాము కలకలం..భయాందోళనలకు గురైన జర్నలిస్టులు

క్రైమ్ మిర్రర్, తెలంగాణ స్టేట్ బ్యూరో: తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణంలో పాము కనిపించడంతో కాసేపు కలకలం రేగింది. అక్కడే విధుల్లో ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ వెంకటేష్ నాయక్ ఏమాత్రం భయపడకుండా పామును సురక్షితంగా పట్టుకున్నారు.

అసెంబ్లీ ప్రాంగణంలోని మీడియా పాయింట్ వద్ద ఈ పాము కనిపించింది. హఠాత్తుగా పాము ప్రత్యక్షమవడంతో అక్కడున్న సిబ్బంది, జర్నలిస్టులు ఒక్కసారిగా భయాందోళనలకు గురయ్యారు. కానిస్టేబుల్ చాకచక్యంగా పట్టుకున్న ఆ పామును అటవీ అధికారులకు అప్పగించి, సురక్షితమైన అటవీ ప్రాంతంలో వదిలేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

తాజావార్తలు