Homeఅంతర్జాతీయంప్రార్థనల పేరుతో మహిళపై లైంగిక దాడి.. పూజారి అరెస్ట్

ప్రార్థనల పేరుతో మహిళపై లైంగిక దాడి.. పూజారి అరెస్ట్

మతపరమైన ఆచారం పేరుతో ఓ మహిళను నమ్మించి లైంగిక దాడికి పాల్పడ్డాడనే ఆరోపణలపై అమెరికాకు చెందిన పూజారి రాజేంద్రనాథ్ దుద్‌నాథ్ మహారాజ్ (50)ను కెనడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన ఒషవా నగరంలో చోటుచేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.

పోలీసుల వివరాల ప్రకారం.. బాధితురాలిని దుష్టశక్తులు ఆవహించాయని నిందితుడు నమ్మించాడు. ప్రత్యేక ప్రార్థనలు, ఆధ్యాత్మిక ఆచారాల ద్వారా వాటిని తొలగిస్తానని చెప్పి ఆమెను ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్లినట్లు ఆరోపణలు ఉన్నాయి. అక్కడ మతపరమైన ఆచారం పేరుతో మహిళపై లైంగిక దాడికి పాల్పడినట్లు ఫిర్యాదు అందింది.

బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి తదుపరి విచారణ కొనసాగుతోంది.

ఇదే తరహాలో నిందితుడు గతంలో మరికొందరిని మోసం చేసి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. అతడి వద్ద ఇలాంటి అనుభవం ఎదురైన బాధితులు ఎవరైనా ఉంటే పోలీసులను సంప్రదించాలని అధికారులు సూచించారు.

మత విశ్వాసాలను ఆసరాగా చేసుకుని ఎవరైనా అనుమానాస్పద ఆధ్యాత్మిక లేదా చికిత్సా విధానాల పేరుతో వ్యక్తిగతంగా కలవాలని ఒత్తిడి చేస్తే అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.

also read: చిన్నారిని స్కూటీపై వదిలి.. గోదావరిలో దూకిన దంపతులు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు