భారత యువ గ్రాండ్‌మాస్టర్ ఆర్. ప్రజ్ఞానంద చెస్ ప్రపంచంలో మరో అరుదైన ఘనత సాధించారు. సెయింట్ లూయిస్‌లో గురువారం జరిగిన గ్రాండ్ చెస్ టూర్ ఫైనల్స్‌లో అమెరికా గ్రాండ్‌మాస్టర్ ఫాబియానో కరువానాపై అద్భుతమైన పునరాగమనం చేసి విజేతగా నిలిచారు.
తొలి దశలో కాస్త వెనుకబడినప్పటికీ ప్రజ్ఞానంద ఏమాత్రం ఒత్తిడికి లోనుకాకుండా తన ఆటతీరును మార్చుకున్నారు. కీలక దశల్లో అద్భుతమైన ఎత్తులతో ప్రత్యర్థిపై పైచేయి సాధించి మ్యాచ్‌ను తనవైపు తిప్పుకున్నారు. దీంతో ప్రతిష్టాత్మకమైన గ్రాండ్ చెస్ టూర్ టైటిల్‌ను తన ఖాతాలో వేసుకున్నారు.
ఈ విజయంతో ప్రజ్ఞానందకు ఈ టోర్నీలో తొలి టైటిల్ దక్కింది. అంతేకాకుండా దాదాపు రూ.2 కోట్ల ప్రైజ్ మనీ కూడా అందుకున్నారు. ఈ ఘనతతో గ్రాండ్ చెస్ టూర్‌ను గెలుచుకున్న తొలి భారతీయ క్రీడాకారుడిగా ప్రజ్ఞానంద చరిత్ర సృష్టించారు.
చిన్న వయసులోనే అంతర్జాతీయ చెస్‌లో తనదైన ముద్ర వేసిన ప్రజ్ఞానంద.. ఈ విజయంతో భారత చెస్‌కు మరో గొప్ప గుర్తింపును తీసుకొచ్చారు. ప్రపంచ స్థాయి ఆటగాళ్లను ఎదుర్కొంటూ సాధించిన ఈ విజయం భారత చెస్ అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపింది.
ప్రజ్ఞానంద సాధించిన ఈ ఘనత భవిష్యత్‌లో మరిన్ని అంతర్జాతీయ విజయాలకు బాటలు వేస్తుందని చెస్ వర్గాలు ఆశిస్తున్నాయి.
also read: ప్రార్థనల పేరుతో మహిళపై లైంగిక దాడి.. పూజారి అరెస్ట్
