ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో రహస్యంగా సాగుతున్న వ్యభిచార కార్యకలాపాలను పోలీసులు గుర్తించి చర్యలు చేపట్టారు. గంగానగర్ ఎక్స్‌టెన్షన్‌లోని ఓ నివాస గృహంలో అనుమానాస్పద కార్యకలాపాలు జరుగుతున్నాయంటూ స్థానికుల నుంచి సమాచారం అందింది. ఈ క్రమంలో భజరంగ్ దళ్ కార్యకర్తలు అక్కడికి చేరుకుని నిరసనకు దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంట్లో ఉన్న రెండు జంటలను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.
పోలీసుల ప్రాథమిక విచారణలో.. ఈ ఇల్లు అమన్ ఫౌజీ అనే వ్యక్తికి చెందినదిగా గుర్తించారు. గతంలో ఈ ప్రదేశాన్ని OYO పేరుతో నిర్వహించగా, ప్రస్తుతం ‘రెసిడెన్సీ’ పేరుతో గదులను గంటల ప్రాతిపదికన అద్దెకు ఇస్తున్నట్లు అధికారులు గుర్తించినట్లు సమాచారం.
ఈ వ్యవహారంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇంటి నిర్వహణ, గదుల అద్దెకు సంబంధించిన వివరాలతో పాటు అక్కడ ఇంకా ఎవరెవరు వచ్చేవారనే కోణంలోనూ విచారణ చేపట్టినట్లు తెలుస్తోంది. దర్యాప్తు పూర్తయిన తర్వాత మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
also read: ప్రజ్ఞానంద సంచలన విజయం.. గ్రాండ్ చెస్ టూర్ గెలిచిన తొలి భారతీయుడిగా రికార్డు!
