Homeఆంధ్ర ప్రదేశ్CM Chandra Babu :రాయ‌లసీమ‌లో రాయ‌ల్ ఎన్‌ఫీల్డ్ త‌యారీ కేంద్రానికి గ్రీన్ సిగ్న‌ల్‌...ఇక నుంచి రాయ‌ల్...

CM Chandra Babu :రాయ‌లసీమ‌లో రాయ‌ల్ ఎన్‌ఫీల్డ్ త‌యారీ కేంద్రానికి గ్రీన్ సిగ్న‌ల్‌…ఇక నుంచి రాయ‌ల్ సీమ అంటూ సీఎం ట్వీట్‌….!

అమ‌రావ‌తి, క్రైమ్ మిర్ర‌ర్‌: సీఎం చంద్ర‌బాబు ప‌రిశ్ర‌మ‌ల అభివృద్దికి పెద్ద‌పీట వేస్తున్నారు. గూగుల్ డాటా సెంట‌ర్‌, క్వాంటం సిద్దాంతం, గ్రీన్‌ఫీల్డ్ రోడ్డులు,బుల్లెట్ రైళ్లు ఇలా చాలా ర‌కాలుగా ప‌రిశ్ర‌మలు ఏర్పాటులో అభివృద్దితో ఉపాధి అవ‌కాశాలు చాలా మెరుగువ‌తాయ‌ని భావించి వీటి ఏర్పాటుకు శ్రీ‌కారం చుట్టారు. తాజాగా ప్రపంచ ప్రఖ్యాత ఐకానిక్ మోటార్ సైకిల్ బ్రాండ్ ‘రాయల్ ఎన్‌ఫీల్డ్’ రాబోతోంది.

తిరుపతిలో రూ.2,500 కోట్లతో మోటర్ సైకిల్ తయారీ పరిశ్రమను రాయల్ ఎన్‌ఫీల్డ్ సంస్థ ఏర్పాటు చేయనుంది. ఏపీకి రాయల్ ఎన్‌ఫీల్డ్ రాకపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ‘రాయల‌సీమ ఇప్పుడు రాయల్‌సీమ’ అనే టైటిల్‌తో రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌ ఉన్న ఫొటోను సీఎం చంద్రబాబు షేర్ చేశారు. ఈ ఫొటోకి ‘రాయలసీమకు దూసుకువస్తున్న రాయల్ ఎన్‌ఫీల్డ్’ అంటూ క్యాప్షన్ పెట్టారు.

రెండు రోజుల క్రితం సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన 17వ రాష్ట్రస్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు(ఎస్‌ఐపీబీ).. రాయల్ ఎన్‌ఫీల్డ్ తయారీ పరిశ్రమకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ప్రాజెక్ట్ కోసం సత్యవేడు పరిధిలోని వన్నెలూరు, రాళ్లకుప్పం గ్రామాల్లో సుమారు 267 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించింది. ఈ పరిశ్రమ ద్వారా సుమారు 5,000 మంది యువతకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.

కాగా ఆనాటి జ్ఞాప‌కాల‌ను సీఎం చంద్ర‌బాబు గుర్తు చేసుకున్నారు. కాలేజీ రోడ్డులో రాయ‌ల్ ఎన్‌ఫీల్డ్ డ్రైవ్ చేశా….ఇప్పుడు ఏకంగా ఏపీకీ తీసుకొచ్చామంటూ ఆనాటి రోజుల‌ను గుర్తు చేసుకున్నారు. ఈ సంద‌ర్భంగా రాయ‌ల్ ఎన్‌ఫీల్డ్ రావ‌డంపై సంతోషం వ్య‌క్తం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు