Homeక్రైమ్రాళ్లతో కొట్టి రౌడీషీటర్ దారుణ హత్య.. జైలు నుంచి వచ్చి కొద్దిరోజులకే దారుణం

రాళ్లతో కొట్టి రౌడీషీటర్ దారుణ హత్య.. జైలు నుంచి వచ్చి కొద్దిరోజులకే దారుణం

నగరంలో రౌడీషీటర్ లక్ష్మీశెట్టి సాయితేజ దారుణ హత్యకు గురయ్యాడు. ఆర్టీవో కార్యాలయం సమీపంలో ఆదివారం అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. గుర్తుతెలియని వ్యక్తులు సాయితేజపై దాడి చేసి రాళ్లతో కొట్టి హత్య చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.

సాయితేజ హత్యపై సమాచారం అందుకున్న డీఎస్పీలు గిరిధర్, జీ. శ్రీనివాసరావు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

హత్యకు గల కారణాలపై పోలీసులు వివిధ కోణాల్లో ఆరా తీస్తున్నారు. ఘటన జరిగిన ప్రాంతంతో పాటు పరిసరాల్లోని సీసీటీవీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తున్నారు. బీవీ నగర్‌కు చెందిన మరో రౌడీషీటర్‌తో పాటు మరికొందరిపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. నిందితులను గుర్తించేందుకు ప్రత్యేకంగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

కాగా, మృతుడు సాయితేజపై గతంలో పలు క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. గతంలో కన్నతల్లిని హత్య చేసిన కేసులోనూ అతడు నిందితుడిగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో అతడిపై పీడీ యాక్ట్ కింద కేసు నమోదు చేసి జైలుకు పంపారు. ఇటీవలే జైలు నుంచి విడుదలైన సాయితేజ కొద్దిరోజులకే హత్యకు గురికావడం స్థానికంగా కలకలం రేపింది.

ప్రస్తుతం సాయితేజ హత్య వెనుక అసలు కారణం ఏమిటనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సీసీటీవీ ఫుటేజీ, ఇతర ఆధారాల ఆధారంగా నిందితులను గుర్తించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు.

also read: ఘోర రోడ్డు ప్రమాదం.. లారీని ఢీకొన్న కారు దగ్ధం.. డ్రైవర్ సజీవ దహనం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు