Homeసినిమా‘హతః’లో ఏదో వింత ప్రపంచం.. నల్ల పిల్లితో ఆసక్తికరంగా ఫస్ట్ అప్డేట్!

‘హతః’లో ఏదో వింత ప్రపంచం.. నల్ల పిల్లితో ఆసక్తికరంగా ఫస్ట్ అప్డేట్!

టాలీవుడ్ హీరో కిరణ్ అబ్బవరం నిర్మాతగా వ్యవహరిస్తున్న కొత్త చిత్రం ‘హతః’ నుంచి తొలి అప్డేట్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈసారి హీరోను చూపించకుండా.. ఓ నల్ల పిల్లిని హైలైట్ చేస్తూ చిత్రబృందం ఆసక్తిని పెంచింది.

విడుదల చేసిన చిన్న వీడియోలో చీకటిగా ఉన్న ఓ పెట్టెలో నల్ల పిల్లి కనిపిస్తుంది. వీడియో చివర్లో సినిమా టైటిల్‌ను రివీల్ చేశారు. దీంతో అసలు కథ ఏంటి? సినిమాలో ఈ పిల్లికి ఎలాంటి ప్రాధాన్యత ఉంది? అనే ప్రశ్నలు ప్రేక్షకుల్లో మొదలయ్యాయి.

మరోవైపు విడుదల చేసిన పోస్టర్ కూడా సినిమాపై క్యూరియాసిటీని పెంచుతోంది. నల్ల పిల్లిని ఎర్రటి చేతులు పట్టుకున్నట్లుగా పోస్టర్‌ను డిజైన్ చేశారు. ఈ విజువల్ సినిమా ఓ మిస్టీరియస్, వింత ప్రపంచం చుట్టూ సాగుతుందనే ఆసక్తిని కలిగిస్తోంది.

అంతేకాదు.. “పిల్లి బతికే ఉందా..?” అనే ప్రశ్నను కూడా చిత్రబృందం ముందుకు తీసుకురావడంతో కథపై మరింత ఉత్కంఠ నెలకొంది. హీరో పాత్ర, కథాంశం వంటి విషయాలను ప్రస్తుతానికి గోప్యంగా ఉంచినట్లు తెలుస్తోంది.

త్వరలోనే ‘హతః’ టీజర్ విడుదల కానున్న నేపథ్యంలో.. అందులో సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. తొలి అప్డేట్‌తోనే ఆసక్తి రేపిన ఈ చిత్రం టీజర్‌తో ఎలాంటి సర్‌ప్రైజ్ ఇస్తుందో చూడాలి.

also read: కృష్ణపట్నం కాల్వలో గుర్తుతెలియని మృతదేహం.. ముత్తుకూరులో కలకలం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు