క్రైమ్ మిర్రర్, తెలంగాణ స్టేట్ బ్యూరో: వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలం తట్టేపల్లి గ్రామ సమీపంలో ఏప్రిల్ 13, 2026 న జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు.
అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా నిర్ధారించిన పోలీసులు, లారీ డ్రైవర్ మొహమ్మద్ షరీఫ్‌ను అదుపులోకి తీసుకున్నారు. డ్రైవర్‌పై నిర్లక్ష్యంగా వాహనం నడిపి మరణానికి కారణమైనందుకు సెక్షన్ 106 BNS కింద కేసు నమోదు చేశారు.
రుక్మాపూర్ గ్రామానికి చెందిన కవిరాజ్ (40), అతని భార్య పావని (35), మరియు వారి కుమార్తె కీర్తన (11) ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ ప్రమాదంలో వీరి కుమారుడు కార్తీక్ (13) స్వల్ప గాయాలతో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. ప్రస్తుతం అతను తాండూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
పావని సోదరుడి వివాహ శుభకార్యం నిమిత్తం జహీరాబాద్ నుండి రుక్మాపూర్‌కు వచ్చిన ఈ కుటుంబం, తిరిగి వెళ్తుండగా తట్టేపల్లి శివారులో ఎదురుగా వచ్చిన లారీ వీరి స్కూటీని బలంగా ఢీకొట్టింది.
