HomeతెలంగాణBreaking: విద్యుత్ ఆర్టిజన్ల సమ్మె విరమణ..!

Breaking: విద్యుత్ ఆర్టిజన్ల సమ్మె విరమణ..!

క్రైమ్ మిర్రర్, తెలంగాణ స్టేట్ బ్యూరో: తెలంగాణా ఉపముఖ్యమంత్రి మరియు ఇంధన శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్కతో జరిపిన చర్చల అనంతరం, విద్యుత్ ఆర్టిజన్లు తమ సమ్మెను తక్షణమే విరమిస్తున్నట్లు ప్రకటించారు.

శుక్రవారం ఉదయం హైదరాబాద్‌లోని ప్రజా భవన్‌లో ఆర్టిజన్ల జేఏసీ (JAC) నాయకులు డిప్యూటీ సీఎంను కలిశారు. ఆర్టిజన్ల సమస్యలపై చర్చించేందుకు ట్రాన్స్‌కో (TRANSCO) సీఎండీ కృష్ణ భాస్కర్‌కు భట్టి విక్రమార్క ఆదేశాలు జారీ చేశారు.

ఆర్టిజన్ల డిమాండ్లను మానవీయ కోణంలో పరిశీలిస్తామని, ఆర్థిక భారం లేని సమస్యలను తక్షణమే పరిష్కరించేందుకు కృషి చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఈ సానుకూల హామీల నేపథ్యంలో, సమ్మెను వెంటనే విరమిస్తున్నట్లు జేఏసీ చైర్మన్ సతీష్ రెడ్డి, కన్వీనర్ సాయిలు ప్రకటించారు.

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

తాజావార్తలు