Homeతెలంగాణఉపాధి హామీ ప‌నుల ప‌రిశీల‌న‌...!

ఉపాధి హామీ ప‌నుల ప‌రిశీల‌న‌…!

ఆత్మకూరు(ఎం),క్రైమ్ మిర్రర్: యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు(ఎం)మండలం బుధవారం అడిషనల్ డీఆర్డీఓ గుర్రం సురేష్ మండలంలోని ఖప్రాయపల్లి, తుర్కలరేపాక గ్రామ పంచాయతీలలో ఉపాధి హామీ పనులను పరిశీలించారు. ఖప్రాయపల్లి గ్రామంలో ఉపాధి హామీ కార్మికుల హాజరును మస్టరులో ఉన్న పేర్లను కార్మికుల వద్ద చదివి వినిపించారు సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం తుర్కలరేపాక గ్రామ పంచాయతీలో నిర్మితమవుతున్న చేపల చెరువును పరిశీలించారు.

ఉపాధి హామీ ప‌నుల ప‌రిశీల‌న‌...!
ఉపాధి హామీ ప‌నుల ప‌రిశీల‌న‌…!

కార్మికులతో మాట్లాడుతూ మీకు నీడవసతి, మంచినీటి సౌకర్యం, ప్రథమ చికిత్స పెట్టె పనిప్రదేశంలో సమకురుస్తున్నారా అని కార్మికులను అడిగి తెలుసుకున్నారు. వారు సమకురుస్తున్నారని తెలపగా అడిషనల్ డిఆర్డీఓ సంతృప్తి వ్యక్తం చేశారు.కార్మికులు పని చేస్తున్నాము కానీ వేతనాలు రాక చాలా రోజులైంది అనగా ప్రభుత్వం విడుదల చేసింది త్వరలో మీమీ ఖాతాల్లో జమాఅవుతాయని తెలిపారు.

ఎండలు అధికంగా ఉంటున్నందున కార్మికులు ఉదయం త్వరగా వచ్చి పనులు ముగించుకుని వెళ్ళాలని తెలిపారు.వడదెబ్బకు గురైనట్లైతే నీడలోకి తీసుకుని వచ్చి చల్లని నీటితో శరీరం అంతా తుడిచి ఓఆర్ఎస్ కలిపిన నీటిని త్రాగించి సమీపంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి వైద్యుల సూచనలు అనుసరించాలని అన్నారు.కార్మికులు ఈ కేవైసీ అందరికీ రావటంలేదు అని అడుగగా ప్రభుత్వ నిబంధనలను అనుసరించి నడవాలని మనం చేసేదేమీ లేదని ఉపాధి హామీ కార్మికులకు తెలిపారు. వీరివెంటా ఉపాధి హామీ ఏపీఓ రమేష్, టీఏలు మల్లేశం, నిర్మల ఏఫ్ఏలు నర్మదా, మల్లేశం ఉపాధి హామీ కార్మికులు ఉన్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు