Homeసినిమా‘ఇరుముడి’లో రవితేజ ఎమోషనల్ జర్నీ.. సినిమాపై హైప్ పెంచుతున్న డబ్బింగ్‌ వీడియో!

‘ఇరుముడి’లో రవితేజ ఎమోషనల్ జర్నీ.. సినిమాపై హైప్ పెంచుతున్న డబ్బింగ్‌ వీడియో!

రవితేజ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘ఇరుముడి’ ప్రస్తుతం చివరి దశ పనుల్లో బిజీగా ఉంది. దర్శకుడు శివ నిర్వాణ రూపొందిస్తున్న ఈ సినిమాలో పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు వేగంగా సాగుతుండగా, తాజాగా రవితేజ తన డబ్బింగ్‌ పనులను ప్రారంభించారు. స్టూడియోలో ఆయన డబ్బింగ్‌ చెబుతున్న దృశ్యాలను చిత్రబృందం విడుదల చేయగా, ఆ వీడియో సోషల్ మీడియాలో మంచి స్పందన తెచ్చుకుంటోంది.

ఆ వీడియోలో రవితేజ చెప్పిన “నాకు ఒకే ఒక్క కూతురు… ఆమె పేరు మణెమ్మ” అనే డైలాగ్ ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ చిన్న క్లిప్‌తోనే సినిమా భావోద్వేగ నేపథ్యం ఎంత బలంగా ఉండబోతుందో అర్థమవుతోంది. వీడియోలో దర్శకుడు శివ నిర్వాణతో పాటు బాలనటి నక్షత్ర కూడా కనిపించడం విశేషం.

ఇప్పటికే షూటింగ్‌ దాదాపు పూర్తయిందని, ఇంకా కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయని సమాచారం. మరోవైపు సంగీత దర్శకుడు జి.వి. ప్రకాశ్‌కుమార్‌ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ పనులు కూడా ప్రారంభించారు. మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఆగస్టు 21న విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

ఇటీవల విడుదలైన గ్లింప్స్‌లో రవితేజ తన కూతురిపై అపారమైన ప్రేమ చూపించే తండ్రిగా కనిపించారు. అనుకోని సంఘటనల వల్ల జీవితంలో మార్పులు ఎదుర్కొని, మద్యం అలవాటుకు లోనైన వ్యక్తి ఎలా మారుతాడు? తన కూతురి మాటతో అయ్యప్ప మాల ధరించి జీవితాన్ని మళ్లీ ఎలా సవరించుకుంటాడు? అనే అంశాలు కథలో కీలకంగా ఉండనున్నాయి.

రవితేజ కెరీర్‌లో 77వ చిత్రంగా రూపొందుతున్న ‘ఇరుముడి’లో భావోద్వేగాలు, భక్తి, కమర్షియల్‌ అంశాలు సమపాళ్లలో మిళితమై ఉంటాయని చిత్రబృందం చెబుతోంది. ముఖ్యంగా తండ్రి–కూతురు బంధం ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనుంది.

ఈ సినిమాలో ప్రియా భవానీ శంకర్ కథానాయికగా నటిస్తుండగా, బేబీ నక్షత్ర రవితేజ కూతురి పాత్రలో కనిపించనుంది. సాయికుమార్‌, అజయ్‌ ఘోష్‌, రమేష్‌ ఇందిర, శ్వాసిక వంటి నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

also read: నటి సాక్షి అగర్వాల్ కొత్త అడుగు – ‘ఓకూ’ న్యూట్రిషన్ బ్రాండ్‌తో బిజినెస్‌లోకి ఎంట్రీ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు